రేషన్ బియ్యాన్ని పట్టుకొన్న టాస్క్ పోర్స్ పోలీసులు.

0
142

www.telaganareporter.news✍9394328296

IMG-20181120-WA0020రేషన్ బియ్యాన్ని పట్టుకొన్న టాస్క్ పోర్స్ పోలీసులు..

రామగుండం కమిషనరేట్, నవంబర్-20, తెలంగాణ రిపోర్టర్:- పెద్దపల్లి జిల్లా లోని సుల్తానాబాద్ లో ప్రభుత్వ సబ్సిడీ బియ్యం (Broken PDS Rice) గా మార్పు చెేసి సురేష్ కుమార్ అండ్ కంపెనీ లో అక్రమంగా నిలువ చేసి అమ్ముతున్నారనే సమాచారం రాగా రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి అక్రమంగా నిల్వ చేస్తున్న గోదాం ఓనరును మరియు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి నుండి ₹. 2,00,000/-, విలువ గల బియ్యం 240 బస్తాలు, (125) క్వింటాళ్ల ప్రభుత్వ సబ్సిడీ బియ్యం(Broken PDS Rice) స్వాధీనం* చేసుకొన్నారు..

IMG-20181120-WA0031

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ డీసిపి (అడ్మిన్) అశోక్ కుమార్ ఉత్తర్వుల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు సిబ్బంది పెద్దపల్లి జిల్లా: లో సుల్తానాబాద్ లోని సురేష్ కుమార్ అండ్ కంపెనీ వారి గోదాములో అక్రమంగా ప్రభుత్వ సబ్సిడీ బియ్యం (Broken PDS Rice) నిల్వ చేసిన పల్లా అనీల్ కుమార్, పురాణం పవన్, తూర్పాటి సారయ్య అనే వ్యక్తులను పట్టుకుని వారి నుండి  2,00,000/- విలువగల (240) 125 క్వింటాళ్ల ప్రభుత్వ సబ్సిడీ బియ్యం (Broken PDS Rice) ను స్వాధీపరుచుకున్నారు

IMG-20181120-WA0021

*నిందితులు*

1. పల్లా అనిల్ కుమార్ s/o సుధాకర్, 34 సం.లు, వైశ్య r/o గాంధీనగర్ సుల్తానాబాద్
2. పురాణం పవన్ s/o సాయిలు, 23 సం.లు, బుడిగెజంగం
3. తూర్పాటి సారయ్య s/o సదనయ్య, బుడిగెజంగం r/o శాంతినగర్ సుల్తానాబాదు

నిందితులను మరియు స్వాధీన పరుచుకున్న ప్రభుత్వ సబ్సిడీ (Broken PDS Rice) బియ్యంను 240 బస్తాలను జిల్లా సివిల్ సప్లై అధికారులకు SHO సుల్తానాబాద్  ద్వారా తదుపరి చర్య నిమిత్తం అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీ.ఐ. సరిలాల్ తెలియజేశారు.

ఈ దాడిలో టాస్క్ ఫోర్స్
సీ.ఐ. సరిలాల్ గారు
మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది
S. శ్రీనివాస్
N. కళ్యాణ్
A. మల్లేష్
లు పాల్గొన్నారు