రోడ్డు భద్రతా మనందరి భాద్యత*..రామగుండం సిపి సత్యనారాయణ

0
221

www.telaganareporter.news✍9394328296..

IMG-20190204-WA0007

*రోడ్డు భద్రతా మనందరి భాద్యత* –
*అతి వేగం అనర్దాలకు కారణం* –
*రోడ్డు భద్రత నియమాలు అందరికి శ్రీరామ రక్ష*-
*రోడ్డు భద్రత వారోత్సవాల ప్రారంబోత్సవంలో సీపి సత్యనారాయణ పిలుపు*.

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఫిబ్రవరి-4, తెలంగాణ రిపోర్టర్:-

“30 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను రామగుండం సిపి వి.సత్యనారాయణ హెల్మెట్ ర్యాలీ ని ప్రారంభించారు*. ఈ నెల
04 నుండి 10 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో వాహన దారులకు చైతన్యం కల్పిస్తామన్నారు.. ఈనెల
14 వ తేదీన యాక్సిడెంట్ ఫ్రీ డే గా పాటిస్తూ పాలు చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ ర్యాలీ ని సోమవారం రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ జెండా ఊపి ప్రారంబించారు..ఈ ర్యాలీ రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్ నుండి గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది..
అనంతరం ప్రధాన చౌరస్తా లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ..

IMG-20190204-WA0009
 పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు ఎవరిని కూడ లోనికి అనుమతించడం లేదని అన్నారు .
 హెల్మెట్: ద్విచక్ర వాహనాలను ఉపయోగించేవారు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ఉపయోగించకపోవడం వలన చాలా మంది ప్రాణాలను కోల్పోయారని, అందరూ తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలను పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
 సీట్ బెల్ట్ : ఫొర్ వీలర్ డ్రైవర్స్ సీట్ బెల్ట్ తప్పక ధరించాలని,
 రోడ్డు ప్రమాదాల నియంత్రణకు విద్యార్థి దశ నుండే యువతకు ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని పోలీస్ కమీషనర్ సూచిoచారు .
 ట్రాఫిక్ పోలీసులు ఆద్వర్యంలో ప్రతి రోజు వివిధ స్కూల్స్, కాలేజీల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు
 వాహనదారులకు, యువకులకు ఆటోడ్రైవర్లకు ఆన్ లైన్ ఈ- చాలన్ వ్యవస్థ గురించి అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు. రామగుండం పోలిస్ కమిషనరేట్ పరిథిలో ఈ-చాలన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని,
 త్రిబుల్ రైడింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్ ,రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే వారికి డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి ఈ- చాలన్ ద్వారా ఫైన్ లు వేయడం మరియు సీజ్ చేయడం జరుగుతున్నదని వివరించారు..
 ఆటోలలో, స్కూల్ బస్ లలో ,కార్లలో పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని,
 డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్రత్యేక తనిఖీలు చేస్తామని,
 నిబంధనలు పాటించని వారికీ సీసీ కెమెరా ల ద్వారా గుర్తించి నేరుగా ఇంటికే చలానాలు పంపిస్తున్నామన్నారు..
 వాహనాలు అమ్మిన వారు వెంటనే కొన్న వారి పేరుపై ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే చలానాలు అసలు యజమాని ఇంటికే వస్తాయని తెలియజేసారు..
 మైనర్ లకు,లైసెన్సు లేని వారికీ వాహనం ఇస్తే యజమానిపై కేసులు పెడతామని,
 డ్రైవింగ్ లైసెన్స్ ,ఆర్.సి ,ఇన్సూరెన్స్ ,పొల్యూషన్ ,ఫిట్నెస్ మొదలగు పత్రాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సూచించారు..
 ట్రాఫిక్ వాలంటీర్లు గా పనిచేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు..

IMG-20190204-WA0010

ఈ కార్యక్రమలో పెద్దపల్లి డిసిపి టి.సుదర్శన్ గౌడ్ ,అడిషనల్ డిసిపి ఏఅర్ సంజీవ్ ,ఎసిపి ట్రాఫిక్ రామగుండం వై.వెంకటేశ్వర్లు ,సిఐ సిఎస్బి వెంకటేశ్వర్లు , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు ,సిఐలు గోదావరిఖని 1 టౌన్ వాసుదేవరావు ,గోదావరిఖని 2 టౌన్ వెంకటేశ్వర్లు ,సి ఐ రామగుండము బుద్ధా స్వామి ,ట్రాఫిక్ సిఐలు కోటేశ్వర్ ,రమేష్ బాబు ,బాబు రావు ,యస్ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు..