వాహనదారులు హెల్మెట్ ధరించాలి…

0
65

కరీంనగర్, sircilla srinivas, 9849162111, telanganareporter


కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుండి హెల్మెట్ వినియోగం అమలు 

IMG-20190109-WA0830

రోడ్డు నియమ నిబంధనలు అవగాహన కలిగి ఉండాలి…..ట్రాఫిక్ ఏసిపి శ్యామసుందర్

విద్యార్థులు రోడ్డు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాం సుందర్ అన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.

బుధవారం నాడు అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆవరణలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్ మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలను నడప కూడదని సూచించారు. త్రిబుల్ రైడింగ్, అతి వేగంగా వాహనాలు నడపడం సరైంది కాదని చెప్పారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఈ చలాన్ విధానం అమల్లో ఉందని, రోడ్డు నిబంధనలు విస్మరిస్తే చెల్లించాల్సిన జరిమానా చలానా ఇంటికి చేరుతుందని చెప్పారు. ఈ చలాన్ విధానంపై అవగాహన కలిగించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతా రెడ్డి, శ్రీలత ఎస్ఐలు స్వామి, వెంకట రాజం తదితరులు పాల్గొన్నారు.

IMG-20190109-WA0831
ద్విచక్ర వాహనదారులు ప్రాణాల రక్షణ హెల్మెట్లను ధరించాలని కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతా రెడ్డి, శ్రీలత అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుండి హెల్మెట్ వినియోగం అమలు చేయనున్నామని తెలిపారు.

IMG-20190109-WA0832

 

బుధవారం నాడు ప్రతిమ మల్టీప్లెక్స్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతా రెడ్డి, శ్రీలత మాట్లాడుతూ అనేక రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం తలకు గాయాలయి మృత్యువాత పడుతున్నారని, హెల్మెట్ ధరించడం వల్ల 90 శాతం మంది ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు.

 

హెల్మెట్ ధరించడం తమ రక్షణ కోసమే అని వాహనదారులు గుర్తించాలని కోరారు. హెల్మెట్ వినియోగించాలని కోరుతూ వాహనదారులకు పూలతో పాటు హెల్మెట్ వినియోగంపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు స్వామి, వెంకట రాజం తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నియమ నిబంధనలు అవగాహన కలిగి ఉండాలి…..ట్రాఫిక్ ఏసిపి శ్యామసుందర్

విద్యార్థులు రోడ్డు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాం సుందర్ అన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.

బుధవారం నాడు అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆవరణలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్ మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలను నడప కూడదని సూచించారు. త్రిబుల్ రైడింగ్, అతి వేగంగా వాహనాలు నడపడం సరైంది కాదని చెప్పారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఈ చలాన్ విధానం అమల్లో ఉందని, రోడ్డు నిబంధనలు విస్మరిస్తే చెల్లించాల్సిన జరిమానా చలానా ఇంటికి చేరుతుందని చెప్పారు. ఈ చలాన్ విధానంపై అవగాహన కలిగించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతా రెడ్డి, శ్రీలత ఎస్ఐలు స్వామి, వెంకట రాజం తదితరులు పాల్గొన్నారు.