వైఎస్‌ జగన్‌తో కేటీఆర్‌ భేటీ….

0
70

హైదరాబాద్ :

IMG-20190116-WA0269

రాష్ట్ర తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

IMG-20190116-WA0277

ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌, సంతోష్‌‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్‌ కొద్దిసేపటి క్రితం వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు.

వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ నేతలకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

ఈ భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేటీఆర్‌ బృందం వైఎస్‌ జగన్‌తో చర్చించనుంది. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుపై వైఎస్‌ జగన్‌ ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు.. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు వి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు.