షి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

0
117

జగిత్యాల: sircilla srinivas, 9849162111


IMG-20190107-WA0418

పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా లోని ZPHS జగిత్యాల గవర్నమెంట్ స్కూల్లో షి టీం అవగాహన సదస్సు నిర్వహించారు.

IMG-20190107-WA0396

ఈసందర్భంగా ఏఎస్ఐ వలి బేగ్ మాట్లాడుతూ …మహిళలను వేధింపులకు గురిచేస్తే షి టీమ్స్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని , మహిళలు, కాలేజ్ యువత కు ఎలాంటి ఆపద వచ్చినా ,వారి పట్ల ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినా, సైగలు చేసినా, నిర్భయంగా షి టీమ్ కు తెలియజేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని అన్నారు.

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నట్లయితే చెడు అలవాట్లు కు పాల్పడవద్దని , చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని, బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని, మన తల్లిదండ్రులు మన గురించి ఎన్నో కలలు కంటారని,వాళ్ళ ఆశలు నీళ్ల పాలు చేయొద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మేము కేసులు పెడితే జీవితం నాశనం అవుతుందని విద్యార్థులకు సూచించారు.

ఆకతాయిలు ఇబ్బందులు గురిచేస్తే షి టీం కు ఫోన్ చేయాలని నంబర్:7330711080/100 విద్యార్థులకు తెలిపారు .

ఈకార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం.దినేష్ కుమార్ , స్టాఫ్, షి టీం సభ్యులు , సుమన్, సరస్వతి, మధు, కేశవ్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.