సమాచార హక్కు చట్టం ప్రజలకు మేలు చేసే విధంగా ఉపయోగించడంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదికలాంటి స్వఛ్చంద సంస్థలు మరింత ముందుకు రావాలి….. జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్

0
64

IMG-20190108-WA0533

JAGTIAL: Sircilla Srinivas, 9849162111


 

సమాచార హక్కు చట్టం ప్రజలకు మేలు చేసే విధంగా ఉపయోగించడంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదికలాంటి స్వఛ్చంద సంస్థలు మరింత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ అన్నారు.

IMG-20190108-WA0532

 

జగిత్యాల జిల్లా కు చెందిన సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2019 క్యాలెండర్‌ ను కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ డా.శరత్ మాట్లాడుతూ…సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలన్నారు. తద్వారా సమాజంలో పేదరికంతో పాటు అవినీతి రహిత సమాజం ఏర్పడగలదన్నారు.

IMG-20190108-WA0322

సమాచార హక్కు చట్టంను సద్వినియోగం చేయడంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదికలాంటి సంస్థలు అనుసరిస్తున్న పాత్ర ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్, అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుర్రం చంద్రశేఖర్ తో పాటుగా సంస్థ సభ్యులు కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, గుండేటి రాజు, గాజుల శ్రీనివాస్, రాగుల గోపాలచారి, ప్రసాద్, గంగాధర్ , శంకరయ్య, నిరంజన్ , సిరిసిల్ల వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.