సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం…

0
104

హైదరాబాద్ :

 నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

assembly

ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

CM-KCR

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..

అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. .ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణస్వీకార కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది.

ఇవాళ 114 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరు కాలేదు.