మానేరు తీరంలో 101 వ సాంస్కృతిక ప్రదర్శన..హాజరైన సిపి కమలాసన్ రెడ్డి

0
155

Sircilla Srinivas ✍: Karimnagar

లేక్ పోలీస్ ఆధ్వర్యంలో 100 కళాబృందాల ప్రదర్శన పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి 101 వ సాంస్కృతిక ప్రదర్శన

కరీంనగరం మానేరుతీరంకు ప్రతి ఆదివారం ఆహ్లాదం కోసం పిల్లాపాపలతో వచ్చే పర్యాటకుల కోసం పోలీసు కళాబృందంతో సాంస్కృతిక ప్రదర్శనలకు పోలీసు కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో.. ఆదివారంతో 101 వ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంలో…. పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి హాజరై, లేక్ ఎస్ ఐ శ్రీశైలం, పోలీసు కళాబృందం నిర్వాహకులు రామంచ తిరుపతిని, బృందం సభ్యులను ఆయన అభినందించారు..

మానేరు తీరంకు వచ్చిన పిల్లలతో పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి కేక్ కట్ చేయించారు.

ఈ సందర్భంగా సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ…. ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకుల కోసం ఒకవైపు సామాజిక బాధ్యత, మరోవైపు శాంతిభద్రతలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం పోలీసు కళాబృందంతో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరగిందన్నారు.

లేక్ పోలీసు ఆధ్వర్యంలో… నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులకు ఎంతగానో ఉత్సాహం కల్పిస్తుందన్నారు.

అంతేకాకుండా, పర్యాటకులకు ఆహ్లాదం, రక్షణ కల్పించడంతో పాటుగా…వివిధ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్రదర్శనల్లో అవకాశం కల్పిస్తుండడంతో…ప్రతి ఆదివారం ముందుగానే ఆయా పాఠశాలలు తమతమ పేర్లు నమోదు చేసుకుంటూ, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారన్నరు.

రెండు సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు పర్యాటకులకు కల్పిస్తున్న ఆహ్లాదం, రక్షణ లో భాగస్వామ్యం అవుతున్న లేక్ ఎస్ ఐ శ్రీశైలం, పోలీసు కళా బృందం రామంచ తిరుపతిని ఆయన బృందాన్ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here