124 వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం

0
98

న్యూఢిల్లీ:

LOKSABHA FILE PHOTO

124వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

modiI

ఈబీసీలకు రిజర్వేషన్ల బిల్లుపై లోకసభలో మంగళవారం నాలుగున్నర గంటలకుపైగా సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల బిల్లుపై డివిజన్ ఓటింగ్ తప్పనిసరైంది. చర్చ అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ డివిజన్ పద్దతిలో ఓటింగ్ చేపట్టారు.

బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఆమోదంతో రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది