18,19,20 తేదీల్లో తెలంగాణ జాగృతి అంత‌ర్జాతీయ యువజ‌న‌ నాయ‌క‌త్వ స‌ద‌స్సు

0
93

Hyderabad, sircilla srinivas,9849162111


IMG-20190112-WA0729

తెలంగాణ జాగృతి ఈ నెల 18,19,20 తేదీల్లో మూడు రోజుల పాటు అంత‌ర్జాతీయ యువ నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది.

హైద‌ద‌రాబాద్‌లోని హెచ్ ఐసిసి లోని నోవాటెల్ హోట‌ల్‌లో స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను గురువారం ప‌రిశీలించారు.
ప‌ద్మ‌భూష‌ణ్ అన్నాహ‌జారే 19వ తేదీన జ‌రిగే ప్రారంభ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. సార్క్ మాజీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అర్జున్ బ‌హ‌దూర్‌ తాపా ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌వుతారు. 20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు స‌మావేశానికి గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్‌.ఎల్ న‌ర‌సింహ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. *గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్క‌ర‌ణ‌లు* అనే అంశంపై స‌ద‌స్సు ప్ర‌ధానంగా కేంద్రీక‌రిస్తుంది. 135 దేశాల నుంచి 550 మంది ప్ర‌తినిధులు స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతారు. 16 దేశాల నుంచి 70 మంది వ‌క్త‌లు, 40 మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు హాజ‌ర‌వుతారు. చ‌ర్చా గోష్టుల‌కోసం ప్ర‌త్యేక హాళ్ల‌ను ఏర్పాటు చేశారు.

మొద‌టి రోజు యువ‌త అభివృధ్ధి పై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శేఖ‌ర్ గుప్తా చ‌ర్చా గోష్టిని నిర్వ‌హిస్తారు. అసోం ఎంపి గౌర‌వ్ గ‌గోయ్‌, హైద‌రాబాద్ ఎంపి అస‌దుద్దీన్ ఒవైసితో పాటు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ప్యాన‌లిస్టులుగా పాల్గొంటారు.
Gandhi, Youth and Sustainability: Perspectives from The World అంశంపై యూకె ఎంపి సీమా మ‌ల్హోత్రా, న్యూజిలాండ్ ఎంపి క‌న్వ‌జిత్ సింగ్ భ‌క్ఛి, యునైటెడ్ నేష‌న్స్‌లో నేపాల్ శాశ్వ‌త ప్ర‌తినిధి మ‌ధు రామ‌న్ ఆచార్య‌, శ్రీలంక ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ ఉప మంత్రి బుదికా ప‌థిరాణా, మాసిడోనియా రిప‌బ్లిక్ పెట్టుబ‌డుల శాఖ మాజీ మంత్రి గ్లిగ‌ర్ త‌స్కోవిచ్‌, ఒకిన‌వా, అప్ఘ‌నిస్తాన్‌ల‌లో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జాన్ డిక్స‌న్ చ‌ర్చ‌లో పాల్గొని ప్ర‌సంగిస్తారు.
రెండో రోజు నైపుణ్య శిక్ష‌ణ‌, స‌మ‌తులాభివృద్ధిలో యువ‌త‌, మ‌హిళ‌ల పాత్ర‌, కార్పోరేటు,ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం పై చ‌ర్చిస్తారు. వీటిని అంత‌ర్జాతీయంగా ఆయా రంగాల్లో నిష్టాతులు నిర్వ‌హిస్తారు.

గాంధేయ‌ మార్గంలో సుస్థిర అభివృద్ధి, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు అంశంపై స‌ద‌స్సులో చ‌ర్చిస్తామ‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు.2030 వ‌ర‌కు భ‌విష్య‌త్ మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అవ‌స‌ర‌మైన ప్రాథ‌మిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ఐక్య‌రాజ్య స‌మితి విడుల చేసిన 17 అంశాల ల‌క్ష్యాల సాధ‌న‌లో భాగంగా తెలంగాణ జాగృతి ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు ను నిర్వ‌హిస్తున్న‌ద‌ని ఆమె తెలిపారు. 135 దేశాల నుంచి 550 మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నార‌ని తెలిపారు. 40 మంది వివిధ రంగాల‌కు చెందిన వారు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌వుతార‌ని ఎంపి క‌విత వివ‌రించారు.
ఐక్య‌రాజ్య స‌మితి నిర్దేశించిన 17 ల‌క్ష్యాలు, అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సులో చ‌ర్చించే అంశాలు

1. పేద‌రిక నిర్మూల‌న‌
2. ఆహార స‌మృద్ది
3. ఆరోగ్యం
4. నాణ్య‌మైన విద్య‌
5. లింగ స‌మాన‌త్వం
6. మంచి నీరు-ప‌రిశుభ్ర‌త‌
7. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల విద్యుత్‌
8. గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ని, ఆర్థికాభివృద్ధి
9. ప‌రిశ్ర‌మ‌లు, మౌళిక వ‌స‌తులు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు
10. అన్ని రంగాల్లో స‌మాన‌త్వం
11.ప‌ర్యావర‌ణ అనుకూల న‌గ‌రాలు, గ్రామాలు
12. బాధ్య‌తాయుత‌మైన వ‌న‌రుల వినియోగం
13.వాతావ‌ర‌ణంలో మార్పులు-మాన‌వాళి బాధ్య‌త‌
14. స‌ముద్ర జీవుల సంర‌క్ష‌ణ‌
15. భూచ‌రాల జీవ‌నానికి అనుకూల వాతావార‌ణంకు కృషి
16. శాంతి, న్యాయం దిశ‌గా ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటు
17. పై ల‌క్ష్యాల కోసం వ్య‌వ‌స్థ‌లు, దేశాల ప‌ర‌స్స‌ర స‌హాకారం