మిగతా గ్రామాలు చైతన్యవంతం కావాలి: పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి

0
59

కరీంనగర్ జిల్లా …

30 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా చొప్పదండి పోలీసులు దత్తత తీసుకున్న కాట్నపల్లి గ్రామంలో శనివారం రాత్రి పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … గత నాలుగు సంవత్సరాలుగా ఈ గ్రామంలో మట్టి వినాయకుని ప్రజలు పూజిస్తున్నరు కాబట్టే…ఈ గ్రామాన్ని చొప్పదండి పోలీసు సిబ్బంది దత్తత తీసుకున్నరన్న విషయాన్ని కమిషనర్ వివరించడం జరిగింది.

30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ఈ గ్రామంలో మేము పెద్ద ఎత్తున హరితహారం ప్లాస్టిక్ నిషేధం, శ్రమదానం వంటి కార్యక్రమాలకు చేపడతామని అన్నారు.

ఊరి భద్రత కోసం ముఖ్యంగా ఊరిలో అయిదు సిసి కెమెరాలు పెట్టడం జరిగిందన్నారు .ఈ గ్రామాన్ని చూసి మిగతా గ్రామాలు చైతన్యవంతం కావాలని …ఈ గ్రామాన్ని ప్రతి నెలా చొప్పదండి ఎస్సై చేరాలు పర్యవేక్షిస్తారన్నారు.

రానున్న రోజుల్లో కూడా అన్ని ఊళ్ళల్లో మట్టి గణపతులను పూజించాలని ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి చైతన్యం అన్ని గ్రామాల్లో ఇలాంటి చైతన్యం కొనసాగాలని అన్ని గ్రామాలు ఈ గ్రామంలాగే అభివృద్ధి కావాలని ఇలా కొనసాగినప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here