రేపు AP EAMCET ఫలితాలు!!

0
95

ఎట్టకేలకు ఏపీ ఎంసెట్‌ – 2019 ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ ఫలితాలను రేపు (మంగళవారం) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల మార్కులు ఏపీ ఎంసెట్ కమిటీకి అందిన నేపథ్యంలో.. ప్రభుత్వ అనుమతితో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  మే 18 తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావించినా…ఆ తర్వాత ఫలితాల విడుదలను వాయిదావేశారు. తెలంగాణకు చెందిన దాదాపు 36వేల మందికి పైగా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు. వీరికి ర్యాంకులు కేటాయించేందుకు ఇంటర్‌ మార్కులు అవసరం కానున్నాయి.ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,95,908 మంది; అగ్రికల్చర్, మెడికల్ విభాగాల నుంచి 86,910 మంది అభ్యర్థులు ఉన్నారు.జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు.

ఫలితాల కోసం; www.EamcetRank.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here