రోబోథాన్ 2020కి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

0
20

– ఉత్సాహ‌వంతుల‌కు సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం
– విజేత‌ల‌కు ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు బ‌హుమ‌తులు గెలుచుకునే చాన్స్‌
– ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న టీటా

హైద‌రాబాద్, 2nd December 2019: సాంకేతిక అక్ష‌రాస్య‌త‌లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిల‌బెట్టాల‌నే ల‌క్ష్యంతో కృషిచేయ‌డంతో పాటుగా రాష్ట్రంలోని ఆవిష్క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) మ‌రో కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. నూత‌న రంగాల్లో సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం క‌ల్పించ‌డంతో పాటుగా ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తులు, విజేత‌ల‌కు అంత‌ర్జాతీయ రోబోటిక్ అవ‌కాశం క‌ల్పించేందుకు `రోబోథాన్-2020`ని ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్ సైన్స్ డే సంద‌ర్భంగా వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 28న నిర్వ‌హించ‌నున్నారు. `రోబోథాన్-2020`ని ఆవిష్క‌రించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి శ్రీ జ‌యేశ్ రంజ‌న్ ఐఏఎస్ గారు ఉత్సాహ‌వంతులు ఈ పోటీలో పాలుపంచుకొని త‌మ స‌త్తా చాటుకోవాల‌ని సూచించారు. 2020 సంవ‌త్స‌రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఇయ‌ర్‌గా ప్ర‌క‌టించిందని, ఈ త‌రుణంలో టీటా ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని శ్రీ జ‌యేశ్ రంజ‌న్ పేర్కొన్నారు.

గ‌త ఐదేళ్లుగా టీటా డిజిథాన్ ఆధ్వ‌ర్యంలో `మాస్ డిజిట‌ల్ లిట‌ర‌సీ` కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. 2015లో డిజిథాన్ లాంచ్ మ‌రియు ప్ర‌భుత్వంతో ఎంఓయూ నిర్వ‌హించారు. 10,000 మందిని డిజిట‌ల్ టీచ‌ర్స్‌గా తీర్చిదిద్దింది. 2016లో #10కే డిజిథాన్ నిర్వ‌హణ‌తో 10 వేల మందిని కంప్యూట‌ర్ అక్ష‌రాస్యులుగా చేయ‌డ‌మ‌నే ల‌క్ష్యం నిర్దేశించుకొని 15,000 మందిని తీర్చిదిద్దింది. 2017లో #100కే డిజిథాన్ ద్వారా ల‌క్ష‌మందిని డిజిట‌ల్ లిట‌రేట్స్‌గా చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకొని రికార్డు స్థాయిలో 1,83, 000 మందిని సాంకేతిక అక్ష‌రాస్యులుగా మార్చారు. 2018లో హ్యాక‌థాన్ నిర్వ‌హించ‌గా 10,000 మంది పాల్గొని 2,500 ఐడియాలు ప్ర‌ద‌ర్శించారు. ఈ ఏడాది 10,000 మందికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌రియు రోబోటిక్స్ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి రోబోథాన్ పోటీని నిర్వ‌హించ‌నున్నారు.

భారీ ఎత్తున నిర్వ‌హించ‌బోయే ఈ రోబోథాన్‌లో భాగంగా గ్రాండ్ ఫినాలే కంటే ముందు 33 జిల్లాలో బూట్ క్యాంప్ నిర్వ‌హించి జిల్లాకు 304 మంది చొప్పున ఆవిష్క‌ర్త‌ల‌ను ఎంపిక చేస్తారు. ఈ ప్రీ ఈవెంట్‌లో ఎంపికైన వారికి రోబోటిక్స్ మ‌రియు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై ప్ర‌త్య‌క్ష శిక్ష‌ణ (Hands on Training) పాటుగా ఇస్తారు. ఈ క్ర‌మంలో వారు ఆర్డినో బోర్డ్‌పై ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. అనంత‌రం వివిధ సామాజిక స‌మ‌స్య‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా ప‌రిష్కారం మార్గం చూపించే ప్ర‌యోగాలు చేస్తారు. ఆబ్‌స్ట‌క‌ల్ అవైడ‌ర్‌, లైన్ ఫాలోవ‌ర్‌, వాల్ ఫాలోవ‌ర్‌, హోం ఆటోమేష‌న్‌, వాయిస్డ్ బేస్డ్ రోవ‌ర్‌, ఆటోమేటిక్ బైక్ లాక్ విత్ వాయిస్‌ల‌ను బూట్ క్యాంప్‌లో ఔత్సాహికుల‌కు నేర్పిస్తారు. అనంత‌రం మొత్తం 304 మంది న‌లుగురి చొప్పున 76 టీంలుగా ఏర్ప‌డి పైన పేర్కొన‌ అంశాల‌పై స్థానిక ప‌రిష్కార మార్గాలు చూపుతారు. వీటిని వ‌చ్చే ఏడాది ఐడియా, ప్ర‌జెంటేష‌న్, కోడ్ రూపంలో [email protected]కు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ లోగా పంపించాల్సి ఉంటుంది. వీటిలో నుంచి ఏడు బృందాల‌ను అంటే 28 మందిని రోబోథాన్ 2020కి ఆహ్వానిస్తారు.

హైద‌రాబాద్‌ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో `రోబోట్స్ విత్ హ్యూమానిటి` పేరుతో జ‌ర‌గ‌బోయే గ్రాండ్ ఫినాలేలో అన్ని జిల్లాల యొక్క 231 టీంలకు చెందిన 928 మంది పాల్గొంటారు. ఇక్క‌డి జ్యూరీ ఫైన‌ల్ బృందాన్ని ఎంపిక చేస్తుంది. టాప్3 విజేత‌కు రూ.ల‌క్ష వ‌ర‌కు బ‌హుమ‌తులు అందించ‌నున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ రోబోటిక్స్ ట్రిప్ అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. పాల్గొన్న వారికి రోబోటిక్స్ యూజ‌ర్ మాన్యువ‌ల్‌, అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్టిసిపేష‌న్ స‌ర్టిఫికేట్‌, ఆర్డినో బోర్డ్‌పై నేర్చుకునే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఈ రోబోథాన్‌లో పాలుపంచుకునే వారికి నామ‌మాత్రంగా రూ.399/- ఫీజుగా తీసుకోనున్నారు. గ్రాండ్ ఫినాలేలో వెంచ‌ర్ కాపిట‌లిస్టులు సైతం పాల్గొన‌నున్నారు.

రోబోథాన్ 2020 గురించి టీటా డిజిథాన్ గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ, సామాజిక స‌మ‌స్య‌ల‌కు రోబోటిక్స్ మ‌రియు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృజ‌నాత్మ‌క ప‌రిష్కారం అనే ఎజెండాతో ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు.పాఠ‌శాల‌లు, కాలేజీల విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోబోథాన్ 2020 ఫినాలేలో వెంచ‌ర్‌ క్యాపిట‌లిస్టులు సైతం పాల్గొన‌డం వ‌ల్ల ఆవిష్క‌ర‌ణలు ఆక‌ర్ష‌ణీయ‌మైన రీతిలో ఉంటే న‌గ‌దు స‌హాయం సైతం దొర‌కుతుంద‌ని, త‌ద్వారా ఉత్ప‌త్తి రూపంలో ఆ ఆవిష్క‌ర‌ణ‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

12 సంవత్స‌రాల పైచీలుకు వారంద‌రికీ అవ‌కాశం క‌ల్పించే ఈ పోటీకి నామ‌మాత్ర‌పు ఎంట్రీ ఫీజును తీసుకుంటున్నారు. bit.ly/robothon2020 లింక్ ద్వారా ఆస‌క్తిగ‌ల వారు త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. 6300368705, 8123123434 నంబ‌రు ద్వారా సైతం స‌మాచారం పొంద‌వ‌చ్చు. శ్రీ జ‌యేశ్ రంజ‌న్ గారు లోగో ఆవిష్క‌రించిన కార్య‌క్ర‌మంలో సౌమ్య కునిశెట్టి, పూజా, శ్రీ‌నివాస్ పిల్లి, విన‌య్ దాస‌రి, ర‌మ్య‌, ప్ర‌దీప్ నిల‌గిరి, నితీశ్‌, వివేక్‌, విక్రం, ఇలియాస్‌, హారిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here