ఉద్యమానికి ఊపిరి బతుకమ్మ పాటలు…

0
65

ఉద్యమానికి ఊపిరి బతుకమ్మ పాటలు…బతుకమ్మ పండగేనని జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ అన్నారు.

రుద్రమ సాహితీ స్రవంతి, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో… బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకల ప్రారంభ కార్యక్రమం సంబరంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి వసంతతో పాటుగా సైనిక్ వెల్ఫేర్ బోర్డు జిల్లా సలహా మండలి సభ్యురాలు సిరిసిల్ల రాజేశ్వరి తో పాటుగా రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి డా.అడువాల సుజాత, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి చిందం సునీత, ప్రధాన కార్యదర్శి శ్రీమతి మేన్నేని నీలిమ, ఉపాధ్యక్షురాలు శ్రీమతి శోభ, శ్రీమతి మార విజయలక్ష్మి మరియు శ్రీమతి శ్యామల,

ఎస్ కెఎల్ ఎన్ ఆర్ బిఇడి కళాశాల కరస్పాండెంట్ ఎంవి నరసింహారెడ్డి, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాస్,వ్యాపార వేత్త రేగొండ నరేష్, శ్రీవాణి కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ శర్మ, శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్,హరి ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళల ప్రధాన పండుగ బతుకమ్మ, సంస్కృతి సాంప్రదాయాలు చాటిచెప్పే పండుగల విశిష్టత గురించి చర్చించడంతో పాటుగా…కళాశాల మైదానంలో బతుకమ్మ పాటలు పాడుతూ…పేర్చిన బతుకమ్మ చుట్టూ విద్యార్థినిలతో కలిసి తిరుగుతూ…బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here