రాష్ట్ర గవర్నర్ నుoడి అవార్డ్ అందుకున్న జిల్లా కలెక్టర్ హన్మంతరావు

0
69

సంగారెడ్డి జిల్లా:

ఉత్తమ ఎన్నికల అధికారిగా రాష్ట్ర గవర్నర్ నుoడి జిల్లా కలెక్టర్  హన్మంతరావు అవార్డ్ అందుకున్నారు

జిల్లా, మండల  ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు, మండల పరిిిషత్  అధ్యక్షులు, గ్రామ సర్పంచులు ఎన్నికలు సమర్థ వంతంగా నిర్వహించి నందుకు గాను రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌంధర రాజన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఉత్తమ ఎన్నికల  అధికారిగా అవార్డు ప్రదానం చేశారు.

గత ఎన్నికలు  జిల్లాలో సజావుగా శాంతియుత వాతావరణం లో  ప్రశాంతంగా సమర్ధవంతంగా నిర్వహించినట్లు  దివ్యంగుల ఓటు బ్యాంక్ పెంచి  ఉత్తమ కలెక్టర్ గా అవార్డ్ అందుకోగా ఇది రెండవది.

ఇవేగాక జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రగామిలో ఉంచుతూ, జాతీయ స్థాయిలో పలు  అవార్డ్ లు  అందుకున్నారు.

అందరి సహకారంతోనే జిల్లా అభివృద్ధి:

ప్రజాప్రతినిధులు అధికారులు,  ప్రజల సహకారం వల్ల  ఇది సాధ్యంమైందని ఇక ముందు కూడా ప్రజాహిత కార్యక్రమంలో అందరూ భాగస్వాములై జిల్లా యంత్రాంగం కు సహకరిస్తే..సంగారెడ్డి జిల్లా రాష్ట్రoలో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతానన్న నమ్మకం ఉందని జిల్లా కలెక్టర్  హన్మంతరావు ” ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ తో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here