గో.ర.సం ‘తెలుగు తలకట్టు శీర్షిక’ విజేతగా శ్రీమతి కవిత

0
63

విజయవాడ:

గోదావరి రచయితల సంఘం (గోరసం ) రాజమహేంద్రవరం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా…

గోరసం 40 రోజుల కవితల పండుగ మరియు తెలుగు తలకట్టు శీర్షిక పోటీలో ప్రతిరోజు సాహిత్యంపై నిర్వహించిన ప్రశ్నలకు ఎక్కువసార్లు సరైన సమయానికి సమాధానాలతో తెలుగు తలకట్టు శీర్షిక విజేతగా శ్రీమతి కటుకం కవిత గోదారి బిడ్డ గా పురస్కారం అందుకున్నాారు.

శనివారము రాత్రి విజయవాడ లో జరిగిన కార్యక్రమం లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలిగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహిస్తున్న శ్రీమతి కటుకం కవిత “గోదారి బిడ్డ” పురస్కారంను రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రంధాలయంలో అందుకున్నారు.

ఈ పురస్కారాన్ని గోరసం అధ్యక్షులు శిష్టు సత్య రాజేష్, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక అకాడమీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, నవ్యాంధ్ర రచయితల సంఘం ఉపాధ్యక్షులు రామసాగర్ కవచం, నవ మల్లెతీగ సంపాదకులు నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ , మాసతరంగిణి పత్రికా సంపాదకులు భవిష్య , కమాండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షకదళం విజయవాడ కొండా నరసింహారావుు వివిధ సాహితీ ప్రక్రియల రచయిత్రి, బాలసాహితీవేత్త శ్రీమతి గుడిపూడి రాధికారాణి చేతులమీదుగా అందుకున్నారు.

శుభాకాంక్షలు:

కళాశ్రీ నిర్వాహకులు గుండేటి రాజు, తెలంగాణ జాగృతి మహిళావిభాగం జగిత్యాల కన్వీనర్ వుజగిరి జమున, కవయిత్రులు మద్దెల సరోజన, అయిత అనిత పలువురు సాహితీ అభిమానులు కవితకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here