సంస్కారం, క్రమశిక్షణ మన ఇంటి నుంచే ఆరంభం కావాలి: జిల్లా కలెక్టర్ డా.శరత్

0
171

శ్రీరామచంద్ర మిషన్ వారి హార్ట్ ఫుల్ నెస్ ధ్యానోత్సవం….

జగిత్యాల:

సంస్కారం, క్రమశిక్షణ మన ఇంటి నుంచే ఆరంభం కావాలనీ…వీటితోనే ఉత్తమ వ్యక్తిత్వం అలవడుతుందనీ…ఇందుకుగాను మెడిటేషన్ (ధ్యానం) ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డా.శరత్ అన్నారు.

శ్రీరామచంద్ర మిషన్ వారి హార్ట్ ఫుల్ నెస్ ఆధ్వర్యంలో జగిత్యాల లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ధ్యానోత్సవం శిబిరాన్ని గురువారం సాయంత్రం ఆయన జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. 

శ్రీరామచంద్ర మిషన్ జగిత్యాల నిర్వాహకులు మంచాల కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ధ్యానోత్సవంలో జిల్లా కలెక్టర్ శరత్ తో పాటు జాయింట్ కలెక్టర్ బి.రాజేశం, ఇంటర్మీడియట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నతాధికారిణి శ్రీమతి సుహాసిని,సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సిటి కేబుల్ టివి సూర్యం, వాకర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సుమారు 2వేల మంది విద్యార్థులు హాజరైన ఈ శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ…..ధ్యానం నేర్చుకోవాలనుకునే వారికి, ధ్యానం అనుభూతి పొందాలనుకునే వారికి, ఒత్తిడి లేని జీవన విధానం కావాలనుకునే వారికి, విధి వ్రాతను మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకునే వారికి ఒక దివ్య అవకాశం అని అన్నారు.

హార్ట్ ఫుల్ నెస్ (heart fulness) అనేది అంతరంగంలో తేలికదనాన్ని అనుభూతి చెందడం, శుభమైన ఆనందాన్ని మన హృదయాల్లో అనుభూతి  కలగడం అన్నారు.

హృదయాన్ని వినిపించుకో గలిగినప్పుడు లోపలి నుండి వచ్చి కూర్చుని అందుకోగలిగినప్పుడు జీవితం మీద తేలికగా పట్టు సంపాదించుకో గలుగుతామని అన్నారు.

హృదయాన్ని మనసును ఏకం చేసే ప్రక్రియను మనం హృదయంపై ధ్యానించడం ద్వారా సాధించగలుగుతాం… ధ్యానం వల్ల మన ప్రవర్తన లోనూ మనం మనం వైఖరులను దీర్ఘకాలిక మార్పు వస్తుందనీ.. సరళమైంది తేలికయింది కూడా… ఏమైనది ప్రతిరోజు హాయిగా మనం మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చునన్నారు..

ఉత్తమమైన జీవన విధానాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ దినోత్సవం లో పాల్గొని తమ జీవన విధానాన్ని క్రమశిక్షణతో మలుచుకోవాలని శ్రీ రామచంద్ర మిషన్ నిర్వాహకులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here