0
68

ఎవరి స్వార్థం కోసం డిగ్రీ కళాశాల అవుతున్నారు…ఎబివిపి జిల్లా కన్వీనర్ మరవేని రంజిత్..

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-

ఎల్లారెడ్డిపేట్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కె టి ఆర్ మరచిపోతే.. ఎలా అని ఎబివిపి జిల్లా కన్వీనర్ రంజిత్ అన్నారు .ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరి స్వార్థం కోసం ఆపుతున్నారు అని ప్రశ్నించారు. నిరుపేద బడుగు బలహీనత గిరిజన విద్యార్థులు ప్రతిభ ఉండి కూడా ఆర్థికంగా లేక చదువుకు దూరం అవుతున్నారని అన్నారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక బడుగు బలహీనత గిరిజన వర్గాల విద్యార్థులు స్థానికంగా డిగ్రీ కళాశాల లేక చదువుకు దూరం అవుతున్నారని, ఎల్లారెడ్డిపెట్ మండలం లో ప్రతి ఏడాది 1000 మంది ఇంటర్ పూర్తి చేస్తున్నారని వారిలో నిరుపేద విద్యార్థులు అధికంగాఉన్నారని అన్నారు. చదవడానికి స్థోమత లేక అనేక మంది పేద బడుగు బలహీనత గిరిజన విద్యార్థులు చదవలేక వలసలు దుబాయ్ మస్కాట్ లాంటి గల్ఫ్ దేశాలకు పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని అవకాశాలు పుష్కలంగా వున్నా డిగ్రీ కళాశాల ఏర్పాటు అందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.డిగ్రి కళాశాల ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కై ఆరాటం ఏబీవీపీ పోరాటం అని అన్నారు. కార్యక్రమంలో చిందు శ్రీనివాస్, మందటి రాము, కొలనూరి ఈశ్వర్, నుకల కిరణ్, కలూరి దినేష్ రెడ్డి, గుగ్గిల రేవంత్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here