అట్ల శ్రీనివాస్ రెడ్డి కి ‘సల్యూట్ సోల్డియర్ సంస్థ’ సత్కారం

0
246

హైదరాబాద్

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి కి ఆంధ్రమహిళా సభలో సత్కారం

మంచి వ్యక్తిత్వం వైపుగా అడుగులు మిలిటరీ కల్చర్ తోనే సాధ్యం – డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్

ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ నందు సల్యూట్ సోల్డియర్ సంస్థ అట్ల శ్రీనివాస్ రెడ్డి , రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ను ఆదివారం యాదాద్రి పీఠాధిపతి గురూజీ చేతుల మీదుగా సత్కరించారు.

ఈ సందర్భంగా అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మనుషులు ప్రవర్తించే తీరు ఒక్కొక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది. మనుషుల ప్రవర్తన తీరును బట్టి వారి యొక్క పర్సనాలిటీ గుర్తించబడుతుంది…

సమాజం ఆమోదించని మనుషులలోని ప్రవర్తనలను బట్టి వ్యక్తిత్వలోపాలు ఏర్పడుతాయి. వ్యక్తిత్వలోపాలను సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు సమాజం నందనవనంలా తయారవుతుంది.

భారతదేశం లోని యువత “మంచి వ్యక్తిత్వం వైపుకు అడుగులు……” వేయడానికి మిలిటరీ కల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది.

మిలిటరీ కల్చర్ ఇతరులను అభినందించడం,తమపై ఇతరుల పై నమ్మకాన్ని కలిగిఉండడం,తను చేసే పనిలో అంకితభావం,నీతి నిజాయితీ గా ఉండడం.ఇతరులతో గౌరవంగా మెలగడం వంటి అలవాట్లను మెరుగు పరుచుకోవడం నేటి పిల్లలు, యువతకు ఎంతో అవసరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బుర్ర వెంకటేశం (ఐ.ఏ.ఎస్ అధికారి)., చంపాలాల్ (ఐ.ఏ.ఎస్), షఫీఉల్లా (ఐ.ఎఫ్.ఎస్), కల్నల్ ప్రవీణ్ కుమార్, టి.ఎన్ రావు, మధునయ్య , వంగీపురం శ్రీనివాస చారి‌ , వంగీపురం శ్రీనాథ చారి తదితరులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here