రెండు నెలలు ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. గ్రామానికి చేరిన గల్ఫ్ బాధితుడు…

0
71

కరీంనగర్ జిల్లా.
గంగాధర మండలం.

దోమకొండ అంజయ్య , ఉప్పరి మాల్యాల వాసి రవాణాకు

ఉచిత అంబులెన్సు

ఇటీవల మాలేసియా దేశంలో భవనం మీద నుండి పడి…

తీవ్ర గాయలపాలై రెండు నెలలు ఆసుపత్రిలో చికిత్స అనంతరం గ్రామానికి చేరిన బాధితుడు.

కరీంనగర్ జిల్లా,గంగాధర మoడలం, ఉప్పరి మల్యాలకు చెందిన దోమకొండ అంజయ్యకు సర్పంచ్ మంజుల శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ ముద్దం జమున నగేష్ లు బాసటగా నిలిచారు.

కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రవాసి మిత్రా లేబర్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల తో ఫోన్లో మాట్లాడారు.

ఆయన తక్షణo స్పందించి వెన్నుముకకు గాయo వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు…. యన్ఆర్ఐ అధికారికి కుటుంబ పరిస్థితి మెయిల్ ద్వారా వివరించి, శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ ఏయిర్ పోర్టు కు అంజయ్యను సురక్షితంగా గ్రామానికి చేర్చారు.

ఆయనతో పాటు మలేసియా నుండి సిద్దిపేట వాసి సురేష్ వెంట రాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కలిపించింది.

ప్రవాసి మిత్రా లేబర్ యూనియన్ వలంటీర్ తునికి రాము హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు అంజయ్య తమ్ముడు రమేష్ తో కలిసి వెళ్లి సహకరించి ఉప్పరి మల్యాల వరకు  వెంట వచ్చాడు.

గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి తమ సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ 9491613129 9849731406 ను సంప్రదించవచ్చని స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here