“మేము సైతం”… ఉత్తేజం కార్యక్రమం లో భాగస్వామ్యం

0
306

జగిత్యాల :

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న...అన్నట్టుగా, నాలుగు దశాబ్దాల క్రితం జగిత్యాల పట్టణంలోని పురాణిపేట పాఠశాలలో విద్మాభ్యాసం చేసి, హైదరాబాద్ లో స్థిరపడిన వ్యక్తితో పాటుగా విద్యాభ్యాసం నేర్పిన గురువు తిరుమల్ కు గురుదక్షిణ గా ఆయన శిష్యులు ఉత్తేజం కార్యక్రమం కు .. “మేము సైతం” అంటూ ఉత్తేజం  కార్యక్రమం లో భాగస్వామ్యం అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే…జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ పదవ తరగతి విద్యార్థులలో విద్యపట్ల ఉత్సాహం పెంపొందిస్తూ…ఉత్తమ ఫలితాల సాధన దిశలో చేపట్టిన “ఉత్తేజం” కార్యక్రమం సత్పలితాలనిచ్చింది.

వరసగా మూడు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.దీంతో కలెక్టర్ శరత్ మరింత ఉత్సాహంతో  నాలుగోసారీ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ముందు నిలవాలన్న లక్ష్యంతో విజయోత్తేజంపేరిట కార్యక్రమం రూపొందించి, ఈ కార్యక్రమం కోసం దాతలు విరాళాలివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

దీంతో… పలు మండలాల నుంచి మంచి స్పందన లభించింది. ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు తమతమ ప్రాంతాలనుంచి, తమ మిత్రులనుంచి విజయోత్తేజం కోసం విరాళాలు సేకరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో…జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తిరుమల్  తన చిన్న  నాటి  మిత్రుల నుండి ఉత్తేజం కై విరాళాలర్థించారు.

ఈ నేపథ్యంలో ఎల్ ఐసి డెవలప్‌మెంట్ అధికారి తుమ్మనపల్లి  విజయకుమార్ ను సంప్రదించిన వెంటనే పాఠశాల పిల్లలకు  అల్పాహారం  అందించడం కోసం  రూ. 10 వేలు జిల్లా  కలెక్టర్ శరత్ చేతుల  మీదుగా అందించారు.

అలాగే, తిరుమల్ తో పాటుగా పురాణిపేట స్కూల్ లో 1980 ఎస్ ఎస్ సి బ్యాచ్ లో చదివిన సయ్యద్ అహ్మద్ సైతం “ఉత్తేజం”  గురించి తిరుమల్ ద్వారా తెలుసుకుని, తానూ తనవంతుగా రూ.10 వేల విరాళం అందిస్తానని “తెలంగాణ రిపోర్టర్” తో మాట్లాడుతూ వెల్లడించారు.

జగిత్యాలలో విద్యాభ్యాసం చేసి, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అధికారి గా పనిచేస్తున్న తాను…జిల్లా కలెక్టర్ శరత్ చేపట్టిన ఉత్తేజం ఇచ్చిన సత్ఫలితాల్లో…విజయోత్తేజం ఫలితాల సాధన కోసం రూ.10 వేలు అందిస్తానని తెలిపారు.

  • అలాగే, లంబాడిపల్లెకు చెందిన
  • పాత్రికేయులు తిరుపతిరెడ్డి 10 వేలు,
  • కేబుల్ ఆపరేటర్ శ్రీనివాస్ రూ.ఐదు వేలు,
  • గొల్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ రూ.20 వేలు అందించారు.

తమకు విద్యాభ్యాసం నేర్పిన గురువు తిరుమల్ కు గురుదక్షిణ గా ఉత్తేజం కార్యక్రమం కు విరాళంగా తమవంతుగా అందిస్తు….విద్యారంగంలో సాధిస్తున్న అభివృద్ధి పట్ల కలెక్టర్ శరత్ కు ఈ సందర్భంలో అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here