బండారు దత్తాత్రేయ కు శుభాకాంక్షలు: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్

0
87

హైదరాబాద్:

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ కు శుభాకాంక్షలు: నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నూతనంగా నియమితులైన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో గురువారం నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర నాయకులు కలిశారు.

నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ నాయకులు దత్తాత్రేయ ను శాలువాతో సత్కరించి,యూనియన్ తరపున మెమొంటో ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నూతన గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ జర్నలిస్ట్ సోదరులకు నా తరఫున పూర్తి సహకారాలు ఉంటాయని, వారి సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తానని, జర్నలిస్టుల సమస్యలపై జాతీయస్థాయిలో నిరంతరం పోరాడుతున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు..

దత్తాత్రేయ ను కలిసిన వారిలో సురేంద్ర బాబు, శ్రీరాఘవన్, నరసింహ రెడ్డి, కస్తూరి శ్రీనివాసరావు, నవీన్, మానస, లలిత, దేవేంద్ర ఉన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here