కొండగట్టు క్షేత్రంలో …హరిత హారం

0
141

జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో …హరిత హారంలో భాగంగా 500 పైచిలుకు ఈత మరియు కర్జూర మొక్కలనునాటారు.

గ్రామాలలో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా అంతే తూకంతో..(కిలో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా కిలో బియ్యం) బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవి శంకర్ , జిల్లా కలెక్టర్ శరత్ , జాయింట్ కలెక్టర్ బి.రాజేషం, అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి, డిఆర్డిఎ పిడి లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, జడ్పీటిసి రాంమోహన్ రావు, సర్పంచి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మల్యాల మండలం కొండగట్టు గుట్టపైన

ఎక్సైజ్ శాఖ చే ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమానికి గురువారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కొండగట్టు గుట్ట పై వై జంక్షన్ లో రోడ్డుకు ఇరువైపులా ఎక్సైజ్ శాఖ ద్వారా 3000 ఖర్జూర మొక్కలను నాటుతున్నట్లుగా పేర్కోన్నారు. ముందుగా మంత్రి వై జంక్షన్ లో మొక్కలనునాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

గ్రామాలలో 30 రోజులలో గ్రామ ప్రణాళిక  కార్యక్రమం ద్వారా పల్లెలన్నీ పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండుటకు సీఎం గారు ప్రత్యేకించి కార్యక్రమము ఏర్పాటు చేశారన్నారు.  30 రోజుల ప్రణాళిక ఎక్కడ చేయలేదని, ఈ ఘనత పూర్తిగా మనకే దక్కుతుందని అన్నారు.  

ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో పల్లెలన్నీ అద్దంలా మెరుస్తున్నాయి అన్నారు.

జిల్లాలో మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో మొట్టమొదటిగా ఒక కిలో ప్లాస్టిక్ కు ఒక  కిలో బియ్యం పథకాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించి, ప్లాస్టిక్ ను సేకరించిన ముత్యంపేట గ్రామానికి చెందిన శ్రీమతి మ్యాక రాధా, అంజవ్వ, పూడూరి గంగు, చంద్రమ్మ లకు సేకరించిన ప్లాస్టిక్ కు సమానంగా బియ్యాన్ని పంపిణి చేశారు.

కొత్త కార్యక్రమాన్ని జిల్లా అంతటా అమలు చేస్తామని మొట్టమొదటిగా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రారంభించడం జరిగిందని పేర్కోన్నారు.

                           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here