తక్షణ నివారణ చర్యలలో భాగంగా పెయిన్ కిల్లర్స్ వలే ఉపయోగపడే 12 గృహ చిట్కాలు.

0
125

ఆరోగ్య సమస్యలు ఎంత చిన్నవైనప్పటికీ తక్షణ ఉపశమనం కోసం నొప్పిని తగ్గించే మార్గాల గురించి మనం అన్వేషిస్తుంటాము. ముఖ్యముగా నొప్పినివారణల గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఇంటిలోనే లభ్యమయ్యే గృహనివారణా చిట్కాల గురించి మాత్రం పెద్దగా శ్రద్ధ చూపరు. సాధారణముగా అధిక మోతాదులో కృత్రిమ పెయిన్ కిల్లర్స్ వాడకం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంటుంది.

అయినప్పటికీ వీటిని తరచుగా వినియోగిస్తుంటారు. అవి మీ కాలేయం, మూత్రపిండాలు మరియు జీర్ణసంబంధిత నష్టాలను కలిగిస్తాయి. స్టెరాయిడ్లు-కాని, వాపు తగ్గించే ఓవర్-ద-కౌంటర్ ఔషధాలు సైతం మెదడు లేదా కాలేయసంబంధిత సమస్యలకు మరియు అజీర్ణం, మగత, మైకం, నిరాశ, దురద లేదా చెమటపట్టుట మొదలైన సమస్యలకు మరియు బలహీన రోగనిరోధక వ్యవస్థకు కారణమవుతుంది.

అందువలన మందులషాపులలో కొనుక్కునే పెయిన్ కిల్లర్ల కన్నా ఇంటిలో అందుబాటులో ఉండే సహజసిద్ధ నివారణా చికిత్సలను అవలంబించడం ద్వారా సమర్థవంతమైన ఫలితాలను పొందగలరు.
వంటగదిలో సాధారణంగా కనిపించే సహజసిద్ధమైన నొప్పినివారణా ఔషధాలను ఇప్పుడు చూద్దాం.

1.పసుపు:
ప్రాచీనకాలము నుండి దీర్ఘకాలిక కండరాల నొప్పులు, వెన్నునొప్పి, పంటినొప్పి మొదలైన అనేకరకాల సమస్యలకు పసుపు కీలకమైన గృహనివారణ చిట్కాగా పనిచేస్తున్నది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే క్రియాశీల పదార్థము ఔషథ ప్రభావాలను కలిగి ఉండడమే ఇందుకు కారణం. అంతేకాకుండా పసుపు యాంటీఆక్సిడెంట్ వలె మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీకార్సినోజెనిక్ లక్షణాలను సైతం కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేయగలదు.
పసుపు-టీ, లేదా పాలలో పసుపును కలిపి తీసుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందగలరు.

2.అల్లం:
కండరాల నొప్పులు, కడుపునొప్పి, చాతీనొప్పి, ఆర్థరైటిస్ మరియు బహిష్టునొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అల్లం కలిగి ఉంటుంది. ఎగువ శ్వాసకోశ సంక్రమణ వ్యాధుల చికిత్సలో అద్భుతమైన ఏజెంట్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు, బ్రాంకైటిస్ మొదలైన తీవ్రమైన సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.
అల్లం-టీ తీసుకోవడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం ఇవ్వగలదని మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందగలరని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

3.లవంగాలు:
లవంగాలు యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం వలన పంటినొప్పి వంటి నోటిసంబంధిత సమస్యలకు ఉపశమనం ఇవ్వడంలో సహాయం చేయగలదు. లవంగాలలో యూగెనాల్ అనే పదార్థం ఉన్న కారణంగా ఇది సహజసిద్ధమైన నొప్పినివారణా లక్షణాలను కలిగి ఉంటుంది‌. క్రమముగా జలుబు, తలనొప్పి, కీళ్లనొప్పులు, వాపు, వికారం మొదలైన సమస్యలకు నొప్పినివారణ మార్గంగా ఉపయోగపడగలదు.
ఒకవేళ మీరు పంటినొప్పితో బాధపడుతున్న యెడల రెండు లవంగాలను పొడిగా చేసి అందులో ఒకచుక్క ఆలివ్ ఆయిల్ వేసి ప్రభావిత ప్రాంతమునందు అప్లై చేయడం ద్వారా ఉపశమనాన్ని పొందగలరు.
లేదా లవంగాలను చప్పరించడం ద్వారా కూడా పంటినొప్పి, నోటిదుర్వాసన నుండి ఉపశమనాన్ని పొందగలరు

4.టార్ట్ చెర్రీస్:
టార్ట్ చెర్రీస్ సహజసిద్ధమైన నొప్పినివారణ మార్గంగా ఉందని మీకు తెలుసా? వీటిలోని సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలైన యాంతోసియానిన్స్ వాపును తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడగలవు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం, టార్ట్ చెర్రీస్ ఎరుపురంగుకు దోహదపడే సమ్మేళనాలు, ఆస్పిరిన్ కన్నా ఎక్కువగా నొప్పినివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్-ఇ కూడా ఎక్కువగా ఉంటుంది.

5.యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్లో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్లను సంతులనం చేయడంలో ప్రముఖపాత్ర పోషించగలదు. ఇందులోని పొటాషియం కీళ్లలో క్యాల్షియం‌ స్థాయిలను పెంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్ తీవ్రతను కూడా తగ్గించగలదు. కండరాల తిమ్మిరిని నివారించడానికి ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక గ్లాసు వెచ్చనినీటిలో కలుపుకుని ప్రతిరోజూ సేవించవలసి ఉంటుంది. మరియు రాత్రివేళలలో కీళ్ళనొప్పిని నిరోధించడానికి ఒకగ్లాసు వెచ్చనినీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మరియు ఒక టీస్పూన్ తేనె కలిపి నిద్రకు ఉపక్రమించే 30నిమిషాల ముందు తీసుకోవడం ఉత్తమం‌. చాతిలో మంటతో బాధపడుతున్న యెడల ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోండి.

6.వెల్లుల్లి:
వెల్లుల్లిలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు ఎటువంటి ఇన్ఫెక్షన్లనైనా నయంచేయడంలో సహాయం చేస్తాయి. ముఖ్యముగా చెవిపోటు, చిన్న సమస్య మరియు ఆర్థరైటిస్ నొప్పి మొదలైన వాటిలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముడివెల్లుల్లిని తీసుకోవడంద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలరు.
దెబ్బతిన్న పళ్ళను చికిత్స చేసేందుకు చిదిమిన వెల్లుల్లిలో చిటికెడు ఉప్పువేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. కండరాలనొప్పి మరియు కీళ్లనొప్పుల విషయంలో వెచ్చని వెల్లుల్లి చమురు మర్ధన ద్వారా ఉపశమనం పొందవచ్చు.

7.కాఫీ:
కాఫీలోని కెఫీన్ ఉనికి తలనొప్పి, కండరాలనొప్పులు మరియు ఇతర నొప్పులనుండి ఉపశమనం కలిగించుటకు అద్భుతముగా పనిచేయగలదు. నొప్పి నివారణా ఔషధాల కన్నా కెఫీన్ ప్రభావవంతముగా ఉంటుంది.
ఒక కప్పు కాఫీ కొద్ది నిమిషాల వ్యవధిలోనే నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వగలదని పరిశోధకులు నిరూపించారు.

8.ఎప్సోమ్ ఉప్పు:
ఎప్సోమ్ ఉప్పు(మెగ్నీషియం సల్ఫేట్) శరీరనొప్పులను తగ్గించే అద్భుతమైన చికిత్సాపర లక్షణాలను కలిగి ఉంటుంది. ఎప్సోమ్ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా, అది మీశరీరంలోకి చొచ్చుకొనిపోయి కీళ్లనొప్పులను మాత్రమే కాకుండా, కండరాలను సడలించడం ద్వారా శరీరానికి ఉపశమనాన్ని కలిగించగలదు.

9.యోగర్ట్:
ఒక బౌల్ సాదా-యోగర్ట్ సహజసిద్ధమైన నొప్పినివారణ పదార్థముగా ఉపయోగపడగలదు. దీనిలోని ఆరోగ్యకర బ్యాక్టీరియా అజీర్తి సమస్యలను తగ్గించడంలో మరియు పొత్తికడుపు నొప్పికి ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయం చేయగలదు. ప్రతిరోజూ ఒక కప్పు నిండా సాదా యోగర్ట్ తీసుకోవడంద్వారా ఉదర సంబంధ సమస్యల నుండి బయటపడవచ్చు.

10.పెప్పర్ మింట్(పుదీనా):
పుదీనా, కండరాలనొప్పి, తలనొప్పి, పంటినొప్పి, నరాలనొప్పి మొదలైన సమస్యలను నివారించడంలో సహాయపడే చికిత్సలక్షణాలను కలిగి ఉంటుంది. నరాలను మరియు కండరాలను ఉపశమనపరచే లక్షణాలను కలిగి ఉండే పుదీనా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో మరియు మానసిక ప్రశాంతతను కలిగించుటలో కూడా సహాయం చేయగలదు. పుదీనా ఆకులను నమలడం లేదా రసాన్ని తీసుకోవడం చేయవచ్చు.

11.ఎర్రద్రాక్ష:
ఎర్రద్రాక్షలో రిస్వరేట్రల్ అని పిలవబడే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన సమ్మేళనం ఉంటుంది. ఇది ఎర్రద్రాక్షకు ఎరుపు రంగునిస్తుంది, మరియు శోథనిరోధక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మృదులాస్థి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈసమ్మేళనం సహాయం చేస్తుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను జాయింట్ పెయిన్స్ మరియు వెన్నునొప్పిని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది.

12.ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్లో ఎక్కువగా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న కారణాన ఇది నొప్పినివారణలో ప్రభావవంతంగా పనిచేయగలదు. ఇందులో ఓలియోకంథాల్ అనే సమ్మేళనం ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడంలో సహాయపడగలదు. ఆలివ్ ఆయిల్లో ఉండే సమ్మేళనాలు ఇబూప్రొఫెన్ లక్షణాలను కలిగిఉండడం ద్వారా నొప్పిఉపశమనానికి మంచి గృహనివారణ చిట్కాగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here