జగిత్యాల ఇంటింటా స్వతంత్ర అభ్యర్థి ముమ్మర ప్రచారం

0
115

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వార్డునా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తుండగా… అధికార పార్టీ అభ్యర్థులతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ తమ ప్రచారంలో మునిగి పోయారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ధరూర్ క్యాంపు 9 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గుండ నాగరాణి రాజేందర్ ఒక ప్రత్యేకతతో వార్డులోని ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రచారం గావిస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ కనుమ రోజున ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రచారం గావించింది. అలాగే శుక్రవారం రోజునా ఇల్లిల్లూ తిరుగుతూ తాను రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళికతో చేపట్టిన కరపత్రం అందిస్తూ…స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు “టెలిఫోన్” గుర్తుపై ఓటేయండి – వార్డు అభివృద్ధి ని కోరుకోండి… అని అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే మీ ఆశీస్సులే నా గెలుపు… అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Gunda Nagarani Rajendar ( Telephone Symbol ) Election Campaign today at 9th Ward

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here