జగిత్యాల బిజెపి లో ముసలం ఉందా? ఏమో…

0
926

జగిత్యాల: sircilla srinivas

జగిత్యాల బిజెపి లో ముసలం ఉందా? ఏమో…అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో ఐపోయాయి….పార్లమెంట్ ఎన్నికలు ఇటీవలే ముగిసాయి…ఇక మిగిలింది మున్సిపల్ ఎన్నికలు.ఈ ఎన్నికల్లోనైనా కలసికట్టుగా ఉండకుండా జగిత్యాల బిజెపి లో ముసలం ఏమిటి? ఒకవైపు మోడి ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతూ, ప్రజలు ఆదరిస్తుంటే…

ఇక్కడేమో, పార్టీ ని బలోపెతం చేయాల్సిందిపోయి అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ…క్యాడర్ లో అయోమయం సృష్టిస్తూ…భేషజాలతో పార్టీ ని దిగజార్చే చర్యలకు పాల్పడడమేటి? అని అనుకోక తప్పదు…ఎందుకంటే, పత్రికలవారికి పార్టీ లోని సీనియర్ నాయకులే సమాచారమందించి, పార్టీ లో ముసలం ఉన్నట్లు చెబుతుంటే…ఇంకేం ఆలోచించాలని, ఎంపి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏమైనా పార్టీ లో సమస్యలుంటే కలిసి చర్చించుకోవాలి కానీ, బజారుకెక్కుతే పరువెవ్వరిది పోతుందో ఆలోచించాలని అంటున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదువెల ఓట్లు కూడా మించలేదనీ…పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు పదివేల వరకు అధికార పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే..కృషి ఎవరిదో ఆలోచించాలనీ…అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైపు దృష్టి సారించిన సీనియర్ నాయకులతీరు పత్రికల్లో వచ్చిన సంగతి వారే మర్చిపోతూ…నరేంద్ర మోడి నాయకత్వంలోని బిజెపి ని జగిత్యాలలో దిగజార్చే విధంగా ప్రవర్తించడం బజారుకెక్కడం సరికాదని ఎంపి వర్గీయులు హితవు పలుకుతున్నారు.

ఒక పత్రికలో బిజెపి పట్ల వచ్చిన వార్త పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగాఉండడమే గాకుండా…వ్యక్తిగతంగా కొందరు వ్యక్తులను టార్గెట్ గా పనిగట్టుకుని ఓ పత్రికలో రాసిన వార్తా కథనం తప్ప మరేమీ కాదన్నది స్పష్టంగా కనిపిస్తుందని వారంటున్నారు.

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనీ….పార్టీ పరంగా కార్యక్రమాలు బహిష్కరిస్తున్నామని కొందరు పార్టీ నాయకులు చెప్పినట్టు మూడు రోజుల క్రితం ఒక పత్రికలో వచ్చిన వార్తలను, వార్తా కథనాలను ఎంపి వర్గీయులు ఖండిస్తున్నారు.

ఎంపి ఎన్నికల సమయంలో ఎవరు ఏ మేరకు పనిచేశారో అందరికీ తెలుసనీ….పార్టీ నాయకులు, ప్రజలు నరేంద్ర మోడిపై ఉంచిన నమ్మకంతో, అందరి సమిష్టి కృషి తో అర్వింద్ గెలుపొందిన సంగతి తెల్సిందేనని పార్టీ శ్రేణులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తూ, నక్సల్స్ తూటాలకు సైతంవెరవకుండా…ముందుకు సాగుతున్న సీనియర్ లను గానీ…పార్టీ నే నమ్ముకున్న కార్యకర్తలనూ పట్టించుకోకుండా…ఎంపి అర్వింద్ తన వ్యక్తిగత ఎజండాతో వెళ్తున్నారనీ..అందుకే వ్యక్తిగతంగా జరుగుతున్న కార్యక్రమాలకువెళ్లడం లేదని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు.

అయితే, ఎన్నికల సమయంలో అర్వింద్ ఒకవైపు పార్టీ క్యాడర్ తో పాటుగా, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో స్వంతంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో యువ క్యాడర్ ను, స్వంత మనుషులను నమ్ముకోవడంతోనే ఎన్నికల్లో గెలుపు సునాయసమైందని అంటున్నారు.

ఇక, ఎంపిగా అర్వింద్ పార్టీ నిర్ణయాలు, సూచనలతో పాటుగా, ఓ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో పనిగట్టుకుని పార్టీ లోని కొందరు నాయకులు, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం తప్ప మరేమీ కాదని ఎంపి వర్గీయులు బాహాటంగా అంటున్నారు.

ఒక సందర్భంలో ఎంపి అర్వింద్ పార్టీ గురించి జరిగిన చర్చ సందర్భంలో… తెలంగాణ రిపోర్టర్ తో మాట్లాడుతూ… “నాకు పార్టీ ముఖ్యం…పార్టీ ప్రతిష్టత ప్రధానం…ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ అన్నది నాకనవసరం…నాతో కలిసి, పార్టీ కోసం పని చేయడానికి ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తాను…సహకరిస్తాను…స్వంతంగా పార్టీ సైన్యాన్ని తయారు చేస్తున్నాను”…అని ప్రకటించారు కూడా….

అందరూ అనుకుంటున్నట్టుగా, ఆయనది వ్యక్తిగత ఏజండా పార్టీ పటిష్టత కోసమే కాకుండా…పార్టీ కోసం దేనికైనా సిధ్దమే…అంటుండడం ఎంపి అర్వింద్ లో పార్టీ పరమైన ఓ నిబధ్దత కనిపిస్తుందని బిజెపి పట్ల ఆకర్షితులైన కొందరు గ్రామీణ యువకులంటున్నారు. …

ఇక ఏ పార్టీ నాయకులొచ్చినా, ఓ పత్రికా ప్రతినిధి పక్కనే కనిపిస్తారన్న అక్కసుతో కూడిన అక్షరాలు ఓ పత్రికలో చూస్తుంటే నవ్వుకోక తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే, అన్ని వర్గాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ…నిబధ్దతతో పని చేసినపుడు, అన్ని పార్టీల నాయకులూ…అన్ని వర్గాల వారికి దగ్గరవడం, వారు దగ్గరకు తీయడం సహజం..అంత మాత్రంచేత, ఎంపి అర్వింద్ నమ్ముకున్న వ్యక్తులను, ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ను, తోటి పత్రికా ప్రతినిధి ని ‘బదనాం’ చేయడం కోసమే ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనమే తప్ప మరేమీలేదని ఎంపి అర్వింద్ వర్గీయులు ఖండిస్తున్నారు.

ఇలాంటి తప్పుడు కథనాలతో పటిష్టవంతమైన క్యాడర్ ను, పార్టీ నిర్మాణాన్ని, ఎంపి అర్వింద్ నిబధ్దతను ఎంత మాత్రమూ తప్పు పట్టడానికి వీలులేదని ఆయన సన్నిహితులంటున్నారు.
అంతేకాకుండా, ఎన్నికల సమయంలో పార్టీ క్యాడర్ ఎంత ముఖ్యమో….నమ్మకమున్న వ్యక్తులు కూడా అంతే ముఖ్యం…ఇక పార్టీ కోసం పని చేసేవారు కావాలన్న ఎంపి అర్వింద్ తనదైన శైలిలోనే ముందుకు సాగుతూ…పార్టీ కోసం పనిచేయడమే ఆయన ధ్యేయం అని ఆయనే చెప్పినపుడు ఇక ఎలాంటి వివాదాలకు తావులేదన్నదీ స్పష్టం అంటున్నారు. ఇది ఇలా ఉండగా ముందునుంచీ జగిత్యాల లో బిజెపి కి మంచి పట్టున్నప్పటికీ, నడిపించే నాయకత్వం పట్ల సరిగాలేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.ఎన్నికల సమయంలో మీడియా మేనేజ్ మెంట్ లో విఫలం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం.ఎందుకంటే,అధికార పార్టీ, అన్ని రాజకీయ పార్టీ లతో పాటుగా బిజెపి సైతం కేవలం కొన్ని ప్రధాన పత్రికలవారిని మాత్రమే “కవర్” చేసుకుని, వారి ఉనికిని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు ప్రధానంగా మొన్నటి పార్లమెంట్ఎన్నికలల్లో స్పష్టంగా కకనిపించింది. కనుక,ఇప్పటికైనా ఇంటిగుట్టును బయటపెట్టకుండాపార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకుసాగితే మంచిది. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బలం పెంచుకోవడానికి ప్రణాళికలు చేసుకోవాలి….ఎంపి అందరినీ కలుపుకుపోవాలి…కలిసి ఉంటే మున్సిపల్ ఎన్నికలలో కలదు విజయం అని గ్రహించాలి….జై భారత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here