అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు….

0
138

జగిత్యాలలో…. అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు 

పట్టణంలో అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డిఓ నరేందర్ మాట్లాడుతూ… మహిళలు ప్రసవానికి ముందు మరియు ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఇందులో ముఖ్యమైన అంశాలు, తల్లి పాల ప్రోత్సాహానికి ఉన్నటువంటి విధానాలు మరియు కార్యక్రమంలోని లోపాలు మరియు తల్లిపాలు పాలు ఇవ్వని కారణంగా కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.ఆస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు మరియు వారి కుటుంబ సభ్యులకు  పాల ప్రాముఖ్యతను వివరించారు.

తల్లిపాలు ప్రారంభించినప్పటి నుంచి తల్లిపాలు కొనసాగించడానికి సహకరించాలని అన్నారు.24 గంటలు తల్లి బిడ్డ ఒకటిగా ఉండాలి అని అన్నారు. పాల బాటిల్, పాల పీకలు వినియోగం వలన కలిగే నష్టాలు తల్లులకు వివరించారు. విధానాలు మరియు కార్యక్రమాలలోని అంతరాలను గుర్తించి, వాటిని  అమలుపరచడానికి తగు సూచనలు చేశారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here