అమీన్‌పూర్ అక్కాచెల్లెళ్లకు ఇవాళే నిజమైన పండుగ : మంత్రి హరీష్ రావు

0
64

సంగారెడ్డి: కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే అమీన్‌పూర్‌కు మంచినీళ్లు

అమీన్‌పూర్ మండలం

బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట్ వరకు రూ.49కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను హరీశ్ రావు ప్రారంభించారు.

బీరంగూడగుట్టపై రూ.69కోట్లతో హెచ్‌ఎండబ్ల్యూఎస్ నిర్మించిన 30లక్షల లీటర్ల రిజర్వాయర్‌ను కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు, జలమండలి కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..’తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే అమీన్‌పూర్‌కు మంచినీళ్లు వచ్చాయని మంత్రి అన్నారు. అమీన్‌పూర్ అక్కాచెల్లెళ్లకు ఇవాళే నిజమైన పండుగ. అనేక సంక్షేమ పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శం. పటాన్‌చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు మంచినీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేశాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిందని’ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here