జగిత్యాల జిల్లా టిఎస్-ఐపాస్ అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానం..

0
191

జగిత్యాల :

కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు అవార్డులు

జగిత్యాల జిల్లా టిఎస్-ఐపాస్ అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 

టిఎస్-ఐపాస్ అమలు ఐదు సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంలో… జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 

టిఎస్-ఐపాస్ ( తెలంగాణ రాష్ట పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వయం ధృవీకరణ  వ్యవస్థ) TS-iPASS  తెలంగాణా ప్రభుత్వం పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులను పొందడానికి టిఎస్-ఐపాస్ చట్టాన్ని తీసుకువచ్చి దాన్ని ఒక సంపూర్ణమైన ఆన్ లైన్ వ్యవస్థ గా రూపొందించింది..

దీని ద్వారా పారిశ్రామిక  అనుమతులు పొందడానికి పెట్టుబడిదారులకు చట్టబద్ధమైన హక్కును  కల్పించింది. అన్ని అనుమతులను పొందడానికి గరిష్టంగా 30 రోజుల్లో పొందే వీలును కల్పించింది. 

ఏ ఒక్క కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఏ అధికారినీ కలవాల్సిన అవసరం లేకుండా పటిష్టంగా ఈ టిఎస్ – ఐపాస్ రూపొందించింది.నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వని ఎడల అందుకు బాధ్యలైన అధికారులకు జరిమానా విధించే విధంగా అనుమతులను డీమ్డ్ గా పరిగణించి, అనుమతులు ఇచ్చే విధంగా రూపొందించింది.

అంతేకాకుండా స్వయం ధృవీకరణ ద్వారా స్వంత పూచీకత్తుపై అనుమతులు ఇవ్వడం వల్ల నియమ నియంత్రణలను పాటించే విషయంలో పరిశ్రమ లపై కూడా బాధ్యత పెరిగింది.

ఇప్పటివరకు జిల్లాలో రూ.28.42 కోట్ల పెట్టుబడితో 98 చిరు మరియు చిన్న తరహా పరిశ్రమలకు  అనుమతులు ఇవ్వబడ్డాయి.వీటితో మొత్తం 8752 మందికి ఉపాధి అవకాశాలు కల్ప్చిబడనున్నాయి. వీటిలో 89 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభినవి. మరో 5యూనిట్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే, త్వరలోనే మొత్తం 99 యూనిట్లు పూర్తి స్థాయిలో  పని చేయనున్నాయి.

ఈ మేరకు జగిత్యాల జిల్లా టిఎస్-ఐపాస్ అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. 
టిఎస్-ఐపాస్ అమలు ఐదు సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంలో… జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 

ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు  జిల్లా కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు శుభాకాంక్షలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here