కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు….

0
38

కరీంనగర్

కరీంనగర్ వ్యాప్తంగా పోలీసులు శనివారం నాడు రాత్రి 11 గంటల నుండి 02 రెండు గంటల వరకు నిర్బంధ తనిఖీలను నిర్వహించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి ఈ తనిఖీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య జరిగిన మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు తనిఖీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 100, హాక్ ఐ, వాట్సప్, ల ఫిర్యాదు చేయాలని పోలీసులు ఐదు నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొని సేవలందింస్తారని చెప్పారు.

అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నీకోసం ప్రజలు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవడానికి పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చిన వివిధ రకాల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ ద్వారా అనుమానితులను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కూడా తనిఖీ చేశారు.

కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీల్లో పలు వ్యవస్థలకు చెందిన 13 వందల మంది పోలీసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డి సి పి లు, ఎస్బిఐ ఎస్బిఐ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here