ఖబర్దార్…ఆర్టీసీ కార్మికులు ఎంతమంది చావాలి..

0
90

జగిత్యాల

మీ రక్తదాహం తీరాలంటే…
ఆర్టీసీ కార్మికులు
ఎంతమంది చావాలి
ఎన్ని శవాలు లేవాలి…

మా నొసటన చిందే రుధిరస్వేదం
గుండెపోటై కారే రక్తం
ఆత్మహత్యల బలిదానాలు
ఇవేం పట్టవా…

బరువైన బాధ్యతల చక్రం కింద
నలిగిన బతుకులు తెల్లారిపోతుంటే
సమ్మెలో తల్లడిల్లిన ప్రాణాలు
గాల్లో కలిసినా
మీ కడుపు నిండదేం…
కనికరం లేదేం…

పిడికిలెత్తిన కార్మికున్ని చూసి
పిరికివారైపోతున్న మీకు
ఇవేవీ పట్టవంటే చెప్పండి…

ఆర్టీసీ కార్మికుల వేలాది పిడికిళ్ళు
ఒక్కటై నినదిస్తాయి…
ఉద్యమగీతం ఆలపిస్తాయి…
గర్జించే సింహాలై
మీ గుండెల్లో నిదురిస్తాయి…
ఖంగుమని మ్రోగే గంటలై
మీ కర్కశగుండెల్ని బద్దలు చేస్తాయి…
ఖబర్దార్…!!!

~ మాడిశెట్టి శ్రీనివాస్ 👣
ధర్మపురి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here