శవ రాజకీయాలు – తెలుగుదేశం దిగజారుతనానికి స్పష్టమైన సంకేతాలు

0
462

శవరాజకీయాలు చేయడంలో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా అగ్రనాయకులు ఆందెవేసినవారు అని వేరే చెప్పనక్కర లేదు. ఎన్టీఆర్ మరణం తరువాత పార్టీపై ఆధిపత్యం కోసం వారు చేసిన విన్యాసాలు , ఎన్టీఆర్ సతీమణిని పెట్టిన వేధింపులకు గురి చేయడం ఎలా మర్చిపోగలం.

కోడెల లాంటి సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా చింతించవలసిన విషయం. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి జరిగిన ఈ అన్యాయాన్ని ఎవ్వరు పూడ్చలేరు. ఇటువంటి విచారకరమైన సంధర్భంలో ముఖ్యమంత్రిగారు ప్రగాఢ సంతాపం తెలియచేసి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పడం , ఎటువంటి రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం వారి గొప్పతనానికి నిదర్శనం. సహజ మరణం కాని పరిస్థితులలో విచారణ కోరడం, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ ముఖ్య కర్తవ్యం. వీటినికూడా రాజకీయాలకు వాడుకోవాలని చూడటం తెలుగు దేశం డొల్ల తనానికి నిదర్శనం. ఒకపక్క కోడెల వారి కుటుంబం శోకసంద్రంలో మునిగి ఉంటే , ఓదార్చి తక్కిన కార్యక్రమాలు చూడవలసిన పెద్ద మనిషి శవంపై చిల్లర వేరుకొనే విధంగా ప్రవర్తించడం మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.

కోడెలపై తప్పుడు కేసులు పెట్టారు, అసెంబ్లీ దొంగగా చిత్రీకరించారు, కుటుంబాన్ని వేధించారు , అందుకే కోడెల ఆత్మహత్య చేసుకొన్నారు అని వైసీపీ , ముఖ్యంగా ముఖ్యమంత్రిపై బురద చాల్లే కార్యక్రమానికి చంద్రబాబు తెరదించడం, దానికి వందిమాగధులు బాకాలు ఉదంతం, జాతీయ మీడియాకు ప్రత్యేకం అని అరకొర ఆంగ్లభాషలో అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా ఆలపించడం నలబై ఏళ్ళ రాజకీయానుభవం అని చెప్పుకొనే మీకు ఏ మాత్రం సిగ్గుగా లేదేమోకాని, రాష్ట్ర ప్రజల పరువు తాకట్టు పెట్టినట్టుంది.

వాస్తవంగా చూస్తే ఎన్నికల సందర్భములోనే కోడెలకు టికెట్ నిరాకరించడం, వారు పట్టుపట్టి నిలబడడం వారికీ ,అధిష్టానికి దూరం బాగా పెంచాయి. కోడెల ఓడిపోయిన తరువాత వారి కుమారుడు, కుమార్తె చేసిన దుర్మార్గాలు ఒక్కొకటి బయటికి రావడం, కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ కుమారుడి దుకాణంలో పట్టుపడటం, ప్రభుత్వంపై , పోలీస్ శాఖపై భాదితుల నుండి ఒత్తిడి పెరిగి కేసులు పెట్టడం, ఇవ్వన్నీ జరుగుతుంటే పార్టీ పెద్దలు అండగా నిలువకపోగా , కనీసం మర్యాదపూర్వకంగా పలకరించకపోవడం వాస్తవం కాదా, గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. గుంటూరులో పల్నాడు ఏరియా వైసీపీ బాధితుల శిబిరం అంటూ డ్రామాలు ఆడుతూ కోడెలను పిలవకపోవడం, చలో ఆత్మకూరు అంటూ కార్యక్రమం పెట్టుకొని కోడెలను పూర్తిగా విస్మరించడం వాస్తవం కాదా. కుటుంబపరంగా ఏమైందో అనే వాటిగురించి ఇది మాట్లాడవలసిన సందర్భం కాదు. కానీ పార్టీ పరంగా వారిని ఏకాకిగా చేయడం, ఎవ్వరు పలకరించకపోవడం, పార్టీ ఆరంభంనుండీ అంటిపెట్టుకొని వున్న కోడెలకు తీవ్ర మనస్తాపం కలుగచేసి అబద్రతాభావంలోకి నెట్టివేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు. తమ తప్పులన్నీ తెలిసికూడా , ఇటువంటి సమయంలో వాటి గురించి మాట్లాడటం సభ్యత కాదు అని వూరుకొంటే , అది వైసిపి బలహీనతగా భావించి తప్పుడు కూతలు, కుట్రలతో అనుకూల మీడియాలో విష ప్రచారం చేయడం మీకే చెల్లు.

శవం పక్కన నిలబడి ఏమన్నారు. కోడెలను మీరు స్వయంగా ఫోన్ చేసి పలకరించారా? చలో ఆత్మకూరు గురించి ప్రస్తావించారా? కష్టకాలంలో కోడెలను కనీసం పలకరించని మీకు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవటానికి పల్నాడు పులిలా కనిపిస్తున్నారా? ఎందుకండీ ఈ కల్లబొల్లి కబుర్లు. నిజంగా మీరు కోడెలను పలకరించివుంటే, చలో ఆత్మకూరుకు పిలిచివుంటే మీరు తుమ్మినా దగ్గినా ఊ దరకొట్టే మీ పటిచ్చ మీడియా మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో ముద్రించి ఉండేదే కాదా?

కోడెల మరణాలని వారు అనుభవించిన మానసిక క్షోభ , ఒంటరితనం ముఖ్యకారణాలు. వాటికి కారణమైన మీరు, మీ పార్టీ నాయకులు తప్పని సరిగా ప్రజలకు జవాబు చెప్పి తీరవలచిందే.

ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు
Varra Raveendrareddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here