ధోనీ స్లో బ్యాటింగ్‌పై స్పందించిన విరాట్ కోహ్లీ!!

0
121

క్రికెట్ వరల్డ్ కప్‌లో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత అత్యధిక స్కోరు మహేంద్ర సింగ్ ధోనీదే. అతడు 61 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేశాడు.

అయితే, ధోనీ ఇన్నింగ్స్ తీరు గురించి చర్చ జరుగుతోంది. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా మొదలైంది. మొదటి 20 పరుగులు చేసేందుకు 40 బంతులు ఆడాడు. ఈ కారణంగా క్రీజులో ధోనీ సహచర బ్యాట్స్‌మెన్‌ కూడా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు కనిపించారు.

ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి భారత ఇన్నింగ్స్‌కు ధోనీ మంచి ముగింపు ఇచ్చాడు. అయితే, మధ్య ఓవర్లలో అతడు నెమ్మదిగా ఆడుతుండటమే చర్చనీయాంశమవుతోంది.

దీని గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ విషయంలో ధోనీని అతడు సమర్థించాడు.

”ఆటగాళ్లెవరికైనా చెడ్డ రోజు ఉంటుంది. ధోనీ విఫలమైన రోజు అందరూ అతడి గురించే మాట్లాడుతుంటారు. మేం మాత్రం అతడికి అండగా ఉంటాం. ఆఖరి ఓవర్లలో 15-20 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ మాకు సాధించిపెడతాడు” అని కోహ్లీ అన్నాడు.

టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ ఎలా చేయాలో ధోనీకి బాగా తెలుసని, పదిలో ఎనిమిది సార్లు అతడి అనుభవం తమకు పనికివస్తుందని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here