అంగరంగ వైభవంగా లక్ష్మి దేవికి లక్ష గాజుల పూజ

0
270

కూకట్ పల్లి : శ్రావణమాసం చివరి శుక్రవారం, శ్రీ వరలక్ష్మివ్రతం సందర్భంగా కూకట్ పల్లి పాత శివాలయంలో మహిళా భక్తుల బృందం చేత విశేషముగా వరలక్ష్మి వ్రతము ఆచరించబడినది.బ్రహ్మశ్రీ జంధ్యాల శిపివిష్టమూర్తి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించబడినదీ. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని సత్యం గల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు. ఈ సందర్భముగా వేలాది మహిళా భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు, అందరికి కూడా పసుపు కుంకుమ గాజులను అలంకారంగా ఇచ్చారు. భక్తులు అందరు కూడా భక్తి శ్రద్ధలతో విశేష పూజలు జరిపి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here