తుదివాక్యం…

0
50

అనుశ్రీ….గోదావరిఖని

కన్న తల్లుల కడుపతీపి కామాంధుల చేతుల్లో …..కాలి బూడిదైపోతోంది….

చిన్నితల్లులను అపురూపంగా దాచుకున్నఅమ్మల గుండెలు ,కుండపోతలై కురుస్తున్నాయిఆడపిల్లల గాథలు శోకగీతాలుగానే, మిగిలిపోతున్నాయి..

ఆడైనా మగైనా కన్నది ఓతల్లేకడుపు తీపీ ఒక్కటె..ఊపిరాగిపోవడమే మరణం కాదుఉసురు తీసిన మృగాన్ని కన్నఆ తల్లికీ మరణమే……
చట్టాలో న్యాయస్థానాలో కాదుకన్నతల్లే ఉరి బిగించితే తప్పమదాందుల్లో మార్పు  రాదు….

నీ ఒక్క కడుపుకోతవేల మందికి హెచ్చరికైతేపుట్టుకనుండే నేర్చుకుంటారుతప్పు చేస్తే అమ్మైనా అపరకాళికవుతుందనిజన్మనిచ్చిన అమ్మే తుదివాక్యం పలుకుతుందని…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here