రాఘవాచారి జీవితం జర్నలిస్టులకు ఆదర్శం…

0
75

హైదరాబాద్:

స్వర్గీయ రాఘవాచారి సంస్మరణ సభలో వక్తల పిలుపు

జర్నలిజం అంటే అంగట్లో అమ్ముకునే సరుకు కాదని, అది ప్రజల చేతిలో ఆయుధంలా ఉండాలని చివరి ఊపిరి వరకు తాను నమ్మిన సిధ్ధాంతాలు, విలువలతో బ్రతికిన ఆదర్శ పాత్రికేయులు చక్రవర్తి రాఘవాచారి జీవితం నేటితరం జర్నలిస్టులకు ఆదర్శం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

ఆదివారం బషీర్ బాగ్ లోని టీయుడబ్ల్యుజె కార్యాలయ ఆడిటోరియంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన స్వర్గీయ రాఘవాచారి సంస్మరణ సభలో….

ఐజేయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఆం.ప్ర.ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్, డాక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరయ్యారు.

వీరితో పాటుగా సుప్రసిద్ధ పాత్రికేయులు చెన్నమనేని రాజేశ్వర్ రావు, రాజేందర్, ఆర్.వి.రామారావు, చంద్రశేఖర్ రెడ్డి, రాఘవాచారి సతీమణి జోత్స్నా, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె నాయకులు మల్లయ్య, రాజేష్, స్వామి, హెచ్.యు.జె.కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొని రాఘవాచారికి నివాళ్ళర్పించారు.

జర్నలిజం అంటే అంగట్లో అమ్ముకునే సరుకు కాదని, అది ప్రజల చేతిలో ఆయుధంలా ఉండాలని తన వృత్తి ధర్మంతో నిరూపించిన ప్రజా పాత్రికేయులు రాఘవాచారి అని వారు కొనియాడారు.

అంకితభావం, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు దర్పణం రాఘవాచారి జీవితమని వారు పేర్కొన్నారు.

ప్రతి ఏటా రాఘవాచారి జయంతిని పురస్కరించుకొని మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులతో స్మారక ఉపన్యాసాన్ని నిర్వహిస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా ఈ సభలో పలువురు జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here