మేడారం మహాజాతరలో అద్భుత ఘట్టం…

0
158

మేడారం:

మేడారం మహాజాతరలో అద్భుత ఘట్టం జరిగింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయల్దేరింది.

గుట్ట దిగువన అమ్మ జనప్రవేశానికి సూచకంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపారు.

భక్తుల కోలాహలం, పోలీసుల బందోబస్తు మధ్య గద్దెల వద్దకు సమ్మక్క పయనమైంది.

సంప్రదాయ ఆదివాసీ నృత్యాల మధ్య సమ్మక్క గద్దెనెక్కేందుకు బయల్దేరింది. తల్లిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు భక్తకోటి ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here