లక్ష్మిపూర్ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

0
147

బెజ్జంకి: (ఎం.కనకయ్య)  

లక్ష్మిపూర్ లో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ ఆధ్వర్యంలో లక్ష్మిపూర్  గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో  తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పెండ్యాల బాపు రెడ్డి పాల్గొన్నారు..సర్పంచ్ మాట్లాడుతూ… పుట్టిన శిశువుకు వెంటనే తల్లిపాలు పట్టాలని,తల్లి పాలు ఆరోగ్యానికి మంచివని, అంగన్ వాడి కేంద్రంలో బిడ్డ,తల్లుల ఆరోగ్యానికి పౌష్టిక ఆహారం లభిస్తుందని,ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.అనంతరం చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం,అన్నప్రాసన చేసారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ పాకాల మహిపాల్ రెడీ, ఎంపీటీసీ ముక్కిస పద్మ రాజీ రెడ్డి,ఉప సర్పంచ్ ముక్కిశ తిరుపతి రెడ్డి, వార్డ్ సభ్యులు ,అంగన్వాడీ టీచర్లు, పి ఎస్ హే చ్ఎం తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here