షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు…నోటిఫికేషన్ విడుదల

0
47

హైదరాబాద్:

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడంతో… ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో 118 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు..

హైకోర్టు ఆదేశాల ప్రకారం కరీంనగర్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో తప్పులు జరిగిన కారణంగా ఎన్నికలు నిలుపుదల చేశామని వెల్లడించారు.

ఇక, రిటర్నింగ్ అధికారులు ఆయా కార్యాలయాల్లో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని నాగిరెడ్డి తెలిపారు. 12వ తేదీ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఆదివారం అయినా అప్పీలేట్ అధికారి అందుబాటులో ఉంటారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here