నా కవిత్వం…

0
20

నా కవిత్వం
నా కవిత్వం అమ్మై ఆదరిస్తుందినాన్నై భరోసానిస్తుంది
సరస్వతీ మాతకినా అక్షరాలు అభిషేకమైతేపదాలు సింధూరం..
అలసటనొందిన వారికి ఆత్మీయంఅలుపెరగక కృషించే వారికి ఆభినందనీయంఅందుకే నా కవిత్వం నిత్య నూతనం
మోసపు మాటలకు దూరమంటుందిమాయదారి మనుషులకు మంటలు రేపుతుంది నా కలంతో నడవాలంటే అందరికీ ఓ భయం 
చందమామ పక్కన చుక్కల్లా మిగిలి పోతారని చింతలతోచిత్ర విచిత్రాలెన్నో చేస్తరు..
నేను మాత్రం సుకుమారంనా కవిత్వం ఎర్ర మందారమైనా కలం గళం ఎప్పుడూ అసమానతలను హెచ్చరిస్తూనే ఉంటుంది.
విజయలక్ష్మి మార…✍✍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here