పంచాయత్ రాజ్ ఉద్యోగి, కోరుట్ల ఎమ్మెల్యే పీఏ గిరీశ్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతు!

0
211

జగిత్యాల….

ధరూర్ సమీపంలో ఒకే అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే నలుగురు సరదాగా కాలువలో ప్రవాహం చూడడానికి దిగారు.

ఐతే వరద ప్రవాహం అధికంగా ఉండడంతో… ఈత రాక గిరీశ్ నీట మునిగి వరద ప్రవాహం కు కొట్టుకు పోయాడని తెలుస్తుంది.

కాగా గిరీష్ మిత్రుడు విజయ్ వెంటనే తేరుకుని…గిరీష్ ను రక్చించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.తృటిలో విజయ్ కాలువకు రైతులు వేసిన నీటిపంపు పైపును పట్టుకుని కాలువ వరద ప్రమాదంనుంచి తప్పించుకున్నాడు.వెంటనే విలపిస్తూ…మిత్రులకు సమాచారమందించాడు.

అంతర్గాం బైపాస్ సమీపంలోని శ్రీరాంసాగర్ కాలువ వద్ద సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న వెంటనే, మల్యాల సిఐ కిషోర్, రూరల్ ఎస్ ఐ సతీష్ ఘటనా ప్రాంతంకు చేరుకుని, ఉన్నతాధికారులకు సమాచారమందించి పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు.

కాలువ వెంట పోలీసులు గాలిస్తున్నప్పటికీ…రాత్రి కావడంతో గల్లంతైన గిరీశ్ జాడ కనుక్కోవడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి.గిరీష్ పంచాయత్ రాజ్ ఉద్యోగి…అతనికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.

అందరితో కలిసిమెలసి ఉంటూ…సరదాగా ఉండే గిరీష్ కాలువలో గల్లంతు విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు.

మిత్రుడు చి.గిరీష్ వరద ప్రవాహం నుంచి బయట పడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here