పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడే వారి భవిష్యత్తు ఉజ్వలం…

0
159

పిల్లల ఇష్టాఇష్టాలతోనే వారి భవిష్యత్తు ఉజ్వలం...

జగిత్యాల:

చదువుతో పాటుగా పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిమ్ ను మంగళవారం ఆవిష్కరించారు.

స్థానిక అభ్యాస్ స్కూల్ విద్యార్థిని, డా.వాసాల శ్రీధర్ కూతురు చిరంజీవి మహిత తో నిర్మాణం గావించిన షార్ట్ ఫిలింను పాఠశాల ఆవరణలో సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ రవిప్రసాద్  చేతులమీదుగా ఆవిష్కరించి, తల్లితండ్రుల ముందు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు షార్ట్ ఫిలింకు ప్రాణమైన గీతం…
ఊహకే ఊపిరి తెస్తే…ఆవిరయ్యెను ఆశలు ఎన్నో…అందమైనా బాల్యాన్ని చిదిమేస్తారే…ఆనందాలా నిమిషాలన్నీ చెరిపేస్తారే…అంతులేని సంతోషాన్నీ అంతం చేస్తారే…అంతుచిక్కనీ ఆక్చేపణలతో అణగద్రొక్కుతారే….ఎందుకనీ…ఎందుకనీ…బందీ చేస్తూ కలలనూ, ఎందుకనీ…ఎందుకనీ..బంధాలంటే భారం వేస్తూ…. అనే , పాటను రచించిన అల్లె మధుబాబు (జగిత్యాల),

తండ్రి పాత్రలో నటించిన గుగ్గిళ్ల రాము తో పాటు  డా.సుమన్, డా.రోజా, డా.శ్రీధర్ వాసాల దంపతులు, చిరంజీవి మహిత, కళాశ్రీ గుండేటి రాజు పాల్గొన్నారు.

తల్లితండ్రులు తమ పిల్లల పట్ల ఒక్క చదువుపైనే ఒత్తిడి కాకుండా, వారివారి ఇష్టాలను సైతం గమనించి, వారిని తీర్చిదిద్దాలన్న సందేశంతో 18 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం తల్లితండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here