పోలీసుల సూచనలు పాటించండి – సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో చేసుకోండి!!

0
117

కరీంనగర్:

పోలీసుల సూచనలు పాటించండి – సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో చేసుకోండని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు.

సంక్రాంతి సంబరాలను సంతోషంతో జరుపుకోండి- పోలీసుల సూచనలు తప్పకుండా పాటించండి!!కరీంనగర్ పోలీస్ కమిషనర్
విబి కమలాసన్ రెడ్డి

తెలుగు లోగిళ్లలో సందడి సంతరించుకునే పండగ సంక్రాంతి. పేద – ధనిక తేడా లేకుండా ఊరు, వాడ భేదం లేకుండా సంతోషంతో జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు విద్యాలయాలకు, కళాశాలలకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు కూడా సెలవులు ఇవ్వటం తో, పట్టణాల్లో స్థిరపడ్డ ప్రజలు, పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఇళ్లకు తాళం వేసి తమ స్వగ్రామాలకు వెళుతుండటం ఆనవాయితీ. ఇళ్లకు తాళం వేసి రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండడం వల్ల సందట్లో సడేమియా లాగ, ఇతర జిల్లాల నుంచి కొన్ని దొంగల ముఠాలు వచ్చి గ్రామాల్లో, పట్టణాల్లో, కాలనీల్లో సంచరిస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రక్కీ నిర్వహించుకుని, రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో.

ఒక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగి, ఒక చిరు వ్యాపారి, ఒక రైతు తను రేయింబవళ్ళు కష్టించి కూడపెట్టిన సొమ్ము నిమిషాల్లో దొంగలు కొల్లగొట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి మానసిక వేదనకు గురి కావడం బాధ కలిగించే విషయం.

ఈ క్రమంలో పండగలకు గ్రామాలకు వెళ్లే ప్రజలు ఈ కింది జాగ్రత్తలు పాటించ వలసిందిగా తెలుపుతున్నాము.

1) ఇంటికి తాళం వేసి వెళ్లే బదులు ఇంటి వద్ద ఎవరో ఒకరు ఉండేలా చూసు కోవడం ఉత్తమం.

2) ఒక వేళ తాళం వేసి వెళ్ళ వలసి వస్తే, విలువైన బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇంటిలో వదిలి వెళ్లకండి.

3) మీ విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్ లో భద్రపరచుకోవాలి.

4) ఇంటికి తాళం వేసి వెళ్లే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించ వలెను.

5) తమ ఇంటిని గమనించుటకు మీ పక్క వారిని గానీ, బంధువులను గానీ కోరవలెను.

6) బస్సుల ద్వారా వెళ్లే ప్రజలు బస్ స్టాండ్ లో అప్రమత్తంగా వుండాలి.

7) తోసుకుంటూ బస్సు ఎక్కే క్రమంలో దొంగలు మీ మెడలో వున్న విలువైన ఆభరణాలు, పర్స్ లు, బ్యాగులు కొట్టి వేసే అవకాశం ఉంది. కావున చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టు పక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి.

8) బస్ స్టాండ్ లో రద్దీ విపరీతంగా వుండే అవకాశం ఉంది. మీతో వున్న చిన్న పిల్లలను చేయి పట్టుకుని మీతోనే వుంచుకొగలరు. వారిని వదిలి పెడితే తప్పి పోయే అవకాశం ఉంది.

9) విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు వున్న మీ బ్యాగులను బస్సు సీట్లో వదిలి మంచి నీటి కోసం, మూత్రశాలకు మరేదైనా వ్యక్తిగత పనుల కోసం ప్లాట్ ఫాం పైకి వెళ్లకండి. ఆ సమయంలో మీ బ్యాగును కొట్టేసి వుడాయించే దొంగలు వుంటారని మరచి పోకండి.

పోలీసుల సూచనలు పాటించండి – సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో చేసుకోండి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here