మున్సిపల్ ఎన్నికలలో బిసి వర్గం పద్మశాలికి అవకాశం కల్పించండి సార్ ..

0
38

జగిత్యాల

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను కలిసిన మేరు సేవా సంఘం

పట్టణ మేరు సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులతో పాటు సంఘ సభ్యులు, శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ను ఆయన అధికార నివాసములో గురువారం మర్యాదపూర్వకంగా కలిశాారు.

తమ సంఘ భవన అభివృద్ధి పనులకుగాను డిఎంఎఫ్ టి నిధులనుండి రూ.10.00 లక్షలు మంజూరు చేసినందుకుగాాను సంఘం తరఫున మరియు మేరు కుల బాంధవుల  తరఫున శాసనసభ్యులు సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ల వేళలా తామంతా మీ వెంటే ఉంటామన్నారు. 

అలాగే, రాబోయే మున్సిపల్  ఎన్నికలలో మేరు సంఘం తరఫున తమ వార్డు నుంచి అవకాశం కల్పింంచాలని కోరారు.

మున్సిపల్ చైర్మెన్ పదవికి బి సి వర్గానికి అవకాశం కల్పించాలని  కోరారు.

ఇప్పటికే జడ్పీీ చైర్మెన్ పదవికిి మున్నూరు కాపు,  మండల పరిషత్ పదవి గౌడ వర్గాలకు కెటాయించగా, మున్సిపల్ పరిధిలో   బిసి వర్గానికి చెందిన ఎక్కువ ఓటర్లున్న పద్మ శాలి వర్గానికి కెటాయించాలనీ…దీంతో అన్ని ప్రధాన బిసి వర్గాలకు కల్పించినట్లవుతుందని ఈ  సందర్భంగా మేరు సంఘం  నాయకులు సూచించారు.

ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే సంజయ్ వారితో మాట్లాడుతూ…అభివృద్ధి లో అన్ని వర్గాల వారికి సమ ప్రాధ కల్పిస్తామన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కావాలన్న నేనున్నాను అని ఎమ్మెల్యే సంజయ్ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here