పోలీసు వృత్తి కత్తిమీద సాము లాంటిది., హోమ్ మంత్రి మహమూద్ అలీ,

0
82

హైదరాబాద్ :

ఎన్నో త్యాగాలు చేస్తే గానీ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.

పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన 418 మంది పోలీసు అధికారులకు రవీంద్రభారతిలో సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత మూడేళ్లలో 418 మంది పోలీసులకు ప్రకటించిన సేవా పతకాలను రవీంద్రభారతిలో డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి మహమూద్ అలీ ప్రదానం చేశారు.

అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ.. దేశానికి ఆదర్శంగా నిలవడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని మహమూద్ అలీ అన్నారు. ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు ముందుగా ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తారన్నారు.

ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని.. అందుకే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఇంత మంది రాష్ట్ర పోలీసులు పతకాలు సాధించడం ఇదే మొదటిసారని.. తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

జగిత్యాల జిల్లా….

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి చేతులమీదుగా పథకాలను అందుకున్న పోలీస్ మహోన్నత సేవ పథకము అందుకున్న సారంగాపూర్ ఎస్.ఐ రాజయ్య, మరియు జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్.ఐ రాజమౌళి మరియు ఉత్తమ సేవా పథకం అందుకున ఏ.ఎస్ఐ శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here