కలెక్టర్ పై ఎంపీ ల అనుచిత ఆరోపణలపై టీ ఉద్యోగుల ఐకాస ఆందోళన

0
348

జగిత్యాల జిల్లా:

జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ కలెక్టర్ గా అవార్డులను అందుకుని, ప్రజాసమస్యల , సంక్షేమంనకు అహర్నిశలు కృష్జి చేస్తున్న

జగిత్యాల కలెక్టర్ శరత్ పై ఎంపీలు డి. అర్వింద్, బండి సంజయ్ కుమార్ లు అనుచిత ఆరోపణలు చేయడాన్ని టీ ద్యోగుల జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ నిరసిస్తూ... జిల్లా కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు ప్రదర్శన నిర్వహించారు.

స్వచ్ఛ భారత్ విషయంలో ఎల్ ఈ డి బల్బులు, చెత్త బుట్టలు పంపిణీ పై అవగాహన కార్యక్రమం సందర్భంగా కొందరు సర్పంచ్ లు ఉమ్మడి చెక్ పవర్ పై ఆందోళన చేస్తున్న సమయంలో అరెస్ట్ ల కు సంబంధించి, పోలీసులపై కలెక్టర్ ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలను టీ ఉద్యోగ ఐకాస నేతలు ఖండించారు. 

స్వచ్ఛ భారత్ లో నెంబర్ 1గా నిలిచిన కలెక్టర్ ను  ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి  స్వఛ్చ హరిత మిషన్ విజయవంతానికి కృషి చేస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు సరికాదని అన్నారు.

కలెక్టర్ పై ఎంపీల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్  చేశారు . అధికారులను, ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీయొద్దని కోరారు.

ఈ కార్య క్రమంలో టీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ భోగ శశిధర్, గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,కో చైర్మన్ ఎండీ వకీల్, తహసిల్దార్ల  సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకటేష్, గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు , తహసిల్దార్ శ్రీనివాస్ రావు, డిఆర్డీఏ ఎపిడి లక్ష్మినారాయణ, వివిధ సంఘాల ప్రతినిధులు  చెలుకల క్రిష్ణ, సత్యం, శంషాద్దీన్, ఖాదర్, ఆంజనేయులు, ఎలిగేటి రవీందర్, నాగేందర్ రెడ్డి, రాజేందర్ రావు, విజేంధర్, నునవత్ రాజు, శ్రీనివాసరావు, తుకారామ్, తిరుమల రావు, ఆధికారుల, ఉద్యోగుల సంఘం ల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here