రుద్రమ సాహితీ స్రవంతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో “దిశ” కు నివాళులు

0
68

జగిత్యాల:

రుద్రమ సాహితీ స్రవంతి, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో “దిశ” కు నివాళులు

రుద్రమ సాహితీ స్రవంతి, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో “దిశ” కు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు.

స్థానిక ప్రైవేటు బిఈడి కళాశాలలో సంస్థ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి చిందం సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు డా.శ్రీమతి అడువాల సుజాత, కళాశాల కరస్పాండెంట్ ఎంవి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, వ్యాపారవేత్త రేగొండ నరేష్, సంస్థ సభ్యులు శ్రీమతి నేరెళ్ల శోభారాణి, మేన్నేని నీలిమ,కుమారి చీకట్ల సంగీత, రాజేంద్ర శర్మ, ప్రిన్సిపాల్ హరిఓంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక (దిశ) చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.

అనంతరం ఏర్పాటైన సమావేశం లో మాట్లాడుతూ…ప్రియాంక దుర్ఘటన దేశం యావత్తూ కలచి వేసిందన్నారు.

ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలన్నారు.

దిశ దుర్ఘటన కు పాల్పడిన నిందితులకు “ఉరి” సరైన శిక్ష అనీ..మరెవ్వరూ కూడా ఆడపిల్లలూ, మహిళలపట్ల వెకిలి చేష్టలు చేయాలంటేనే భయం కలిగేలా…వారికి శిక్ష త్వరితగతిన పడాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here