బేబీ గా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే !

0
54

నందిని రెడ్డి డైరెక్షన్ సమంత నటించిన ఓ బేబీ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన వారు సమంతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. సినిమాలో కామెడీ అండ్ ఎమోషన్ సమపాళ్లలో ఉన్నాయంటూ ట్విట్టర్ లో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.  ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్‌ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

సినిమా ఎక్కడా స్లో అవుతున్న భావన కూడా చూసే ప్రేక్షకులకు అనిపించదు.ఇలా గ్రిప్పింగ్ నరేషన్ చేసినందుకు నందిని రెడ్డి పని తీరును మెచ్చుకొని తీరాల్సిందే అని చెప్పాలి.అలాగే కథానుసారం వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి.కానీ సెకండాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఎంటెర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాసరే అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది.ఈ విషయంలో నందిని రెడ్డి కాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.కానీ క్లైమాక్స్ అద్భుతంగా ఉండేసరికి దాని ముందు మాత్రం ఇవన్నీ తేలిపోతాయి.

ఇక ఇతర సాంకేతిక వర్గం విషయానికి వచ్చినట్టయితే ఎల్లప్పుడూ వైవిధ్యభరితమైన సినిమాలు అందించే సురేష్ ప్రొడక్షన్స్ వారి నుంచి మరో మంచి సినిమా వచ్చిందని చెప్పాలి.పాటల్లో రిచర్డ్ ప్రసాద్ అందించిన కెమెరా పనితనం సహా నిర్మాణ విలువలు బాగున్నాయి.అలాగే మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు పర్వాలేదనిపిస్తాయి తప్ప అతని మార్క్ కనిపించవు.

వృద్ద పాత్ర కోసం కొంత కసరత్తు చేశాను. సినిమాకు ముందు వృద్ధుల ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ చాలా మంది వృద్దులతో మాట్లాడాను. వారి బాడీ లాంగ్వేజ్ చూశాను. వృద్ధులంటే చిన్నపిల్లలతో సమానం. వారిలో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ప్రతీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. బేసిక్‌గా నేను యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు. తోటి నటీనటులను చూసి నేర్చుకొన్నాను. ఓ బేబీలో కామెడీ పరంగా నటన రాజేంద్ర ప్రసాద్‌తో సాధ్యమైంది. సీనియర్ నటుడిగా ఆయన చాలా హెల్ప్ అయ్యారు. సీనియర్ నటి లక్ష్మీ గారిని చూసి కొంత నేర్చుకొన్నాను అని సమంత చెప్పారు.

ఓ బేబీ రివ్యూ 
నటీనటులు : సమంత , లక్ష్మీ , రాజేంద్రప్రసాద్ , నాగశౌర్య
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : D. Suresh Babu, Sunitha Tati, T.G.Vishwa Prasad, Hyunwoo Thomas Kim
దర్శకత్వం : నందిని రెడ్డి
రేటింగ్ : 3.5 /5 
రిలీజ్ డేట్ : 5 జూలై 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here