శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

0
72

హైదరాబాద్ :

నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్ , దత్తాత్రేయ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ .ఎస్ .చౌహాన్ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎంపీ సుజనాచౌదరి, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ , మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ , సినీ ప్రముఖులు మహేశ్ బాబు, వెంకటేశ్ , రాఘవేంద్రరావు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ , తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల తదితరులు హాజరయ్యారు.

ఫౌండేషన్ తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన సంస్కృతిలో భాగమైన పండుగలను మరవకూడదన్నారు. అమృతం వంటి అమ్మ భాష తెలుగును మర్చిపోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here