ఫార్మసీలో గజ్జెల కల్పనకు డాక్టరేట్…

0
79

వరంగల్: 

వరంగల్ కాజిపేటకు చెందిన శ్రీమతి గజ్జెల కల్పన ఫార్మాస్యూటికల్ విభాగంలో ఐసోలేషన్-కారెక్టరైజేషన్ అనే ప్రక్రియలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి పట్టా ప్రదానం గావిస్తున్నారు.

ఫార్మసీ విభాగంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ లు డా.జయప్రకాశ్,డా.రవీంద్ర నాథ్ ల ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పట్టా లభించడంపట్ల శ్రీమతి కల్పన సంతోషం వ్యక్తం చేయగా, విశ్వవిద్యాలయం సిబ్బంది, బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేసి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

త్వరలో జరగనున్న పట్టా ప్రదానోత్సవం (కాన్వొకేషన్) లో శ్రీమతి కల్పన డాక్టరేట్ పట్టాను ప్రముఖుల చేతులమీదుగా అందుకోనుంది.

కాగా కల్పన ఒక విద్యావేత్త గానే కాకుండా, రచయిత్రిగా శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి నిర్వహించిన అక్షరయాన్ రచయిత్రుల “భరోసా” “బతుకమ్మ” తదితర కార్యక్రమాలలో పాల్గొని పలువురి మన్ననలు పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here